Thursday, 5 November 2026

June 2013

అంతర్జాతీయం

కేదర్‌నాథ్‌ వద్ద కూలిన హెలికాప్టర్‌

డెహ్రాడూన్‌,(జనంసాక్షి): వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు వెళ్లిన ఓ ప్రైవేటు హెలికాప్టర్‌ ప్రమాదవశాస్తు కూలిపోయింది, పైలట్‌ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన కేదర్‌నాథ్‌ వద్ద చోటు చేసుకుంది.

అంతర్జాతీయం

సైనా నెహ్వాల్‌ ఓటమి

సింగపూర్‌,(జనంసాక్షి): సింగపూర్‌ ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్‌లో సైనా నెహ్వాల్‌ ఓటమిపాలైంది. ఇండోనేషియా క్రీడాకారిణి ఫనేత్రి చేతిలో 17-21,21-13,21-13 తేడాతో సైనా ఓడిపోయింది.

కరీంనగర్

ఏసీబీకి చిక్కిన మల్యాల సబ్‌ట్రెజరీ అధికారి

కరీంనగర్‌,(జనంసాక్షి): లంచం తీసుకుంటూ మల్యాల సబ్‌ ట్రెజరీ అధికారి భాస్కర్‌ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఫించన్‌ కోసం రూ.10 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయనను పట్టుకున్నారు.

తెలంగాణ

దాల్మియా ఛార్జిషీటుపై విచారణ వాయిదా

హైదరాబాద్‌,(జనంసాక్షి): జగన్‌ అక్రమాస్తుల కేసులో దాల్మియా ఛార్జీషీటుపై విచారణ జులై 1 వ తేదీకి వాయిదా పడింది. జగన్‌, విజయసాయిరెడ్డిలను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నాంపల్లి సీబీఐ కోర్టు విచారించింది.

తెలంగాణ

రైలు ఢీకొని మహిళ మృతి

వరంగల్‌,(జనంసాక్షి): మహబూబాద్‌లో పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మహిళ మృతి చెందింది. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

అంతర్జాతీయం

బీహార్‌ మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం

పాట్నా : ఉత్తరాఖండ్‌ వరదల్లో మృతిచెందిన బీహార్‌కి చెందిన యాత్రికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2లక్షలు పరిహారం అందించనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ ప్రకటించారు.

తెలంగాణ

తూర్పు గోదావరి గ్రంథాలయ ఛైర్మన్‌ నియామకం నిలిపివేత

హైదరాబాద్‌ : తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ ఛైర్మన్‌ నియామకాన్ని నిలుపుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.

తెలంగాణ

ఒప్పంద అధ్వాపకులను సెప్టెంబర్‌ వరకు కొనసాగించాలి

హైదరాబాద్‌ : ఒప్పంద అధ్వాపకులను ఈ విద్యాసంవత్సరంలో సెప్టెంబర్‌ 30 వరకు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో 1,766 మంది ఒప్పంద అధ్వాపకులు పనిచేస్తున్నారు.

తెలంగాణ

శాసనసభ.. 52 గంటల 29 నిమిషాలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): రెండు దఫాలుగా జరిగిన అసెంబ్లీ సమావేశాలు 20 రోజుల పాటు కొనసాగాయి. 20 రోజుల్లో 52 గంటల 29 నిమిషాలు సభ కొనసాగింది. ఈ సమావేశాల్లో 14 బిల్లులు ఆమోదం పొందాయి. సభలో జరిగిన చర్చల్లో 96…

తెలంగాణ

సహాయ చర్యలను పరిశీలించేందుకు వెళ్లనున్న మంత్రులు

హైదరాబాద్‌ : ఉత్తరాఖండ్‌లో చేపడుతున్న సహాయ చర్యలను పరిశీలించేందుకు రాష్ట్రం నుంచి కేంద్రమంత్రి బలరాం నాయక్‌, రాష్ట్రమంత్రి దానం నాగేందర్‌లు వెళ్లనున్నట్లు సమాచారం.