Thursday, 5 November 2026

June 2013

జాతీయం

పతనమైన బంగారం, వెండి ధరలు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రూపాయి విలువ పతనం ప్రభావం బంగారం, వెండి ధరలపై పడింది. ఇవాళ స్టాక్‌ మార్కెట్లో బంగారం, వెండి ధరలు విఫరీతంగా తగ్గిపోయాయి. బంగారం ధర తులానికి రూ.400 తగ్గిపోయి రూ.2000 కు చేరుకుంది. కిలో వెండి ధర…

జాతీయం

మూడో వికెట్‌ కోల్పోయిన శ్రీలంక

కార్డిన్‌,(జనంసాక్షి):ఛాంపియన్స్‌ ట్రోఫిలో భాగంగా భారత్‌-శ్రీలంకల మధ్య జరుగుతున్న సెకండ్‌ సెమీ ఫైనల్స్‌ మ్యాచ్‌లో శ్రీలంక మూడో వికెట్‌ కోల్పోయింది. 41 పరుగుల వద్ద శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ సంగక్కర పదిహేడు పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద ఔటయ్యారు.

జాతీయం

ఉత్తరాఖండ్‌ వరదలపై సుప్రీంకోర్టు నోటీసులు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌ వరదలపై సుప్రీంకోర్టు స్పందించింది. వరదలలో చిక్కుకున్న బాధితులను రక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలను కోర్టుకు తెలపాలని నోటీసులు జారీ చేసింది. సహాయక చర్యలకు సంబంధించి ఈనెల 25 లోపు నివేదిక ఇవ్వాలని కేంద్ర…

ఖమ్మం

ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్య

ఖమ్మం,(జనంసాక్షి): ఆర్థిక ఇబ్బందులు తాళలేక దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణంలోని వీడీవోస్‌ కాలనీలో చోటుచేసుకుంది. కాలనీకి చెందిన రేజర్ల శ్రీనివాస్‌ (40), అతని భార్య మంగమ్మ (35) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు…

తెలంగాణ

తెలంగాణ ఇవ్వకపోతే పార్టీని వీడతామంటున్నారు: కేకే

హైదరాబాద్‌ : తెలంగాణ ఇవ్వకపోతే పార్టీని వీడతామని తనను కలిసిన కాంగ్రెస్‌ నేతలు చెప్తున్నారని కాంగ్రెస్‌ నుంచి తెరాసలో చేరిన కేశవరావు చెప్పారు. పార్టీని విడిచిపెట్టనివారు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయవద్దని నిర్ణయించుకున్నట్లు కేకే చెప్పారు.

అంతర్జాతీయం

జార్జండ్‌ సాయం రూ. 5 కోట్లు

రాంచి: వరదలతో అతలాకుతులమైన ఉత్తరాఖండ్‌లో సహాయ, పునరావాస చర్యల కోసం జార్జండ్‌ ప్రభుత్వం రూ. 5కోట్ల విరాళం ప్రకటించింది. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటికే పాతిక కోట్ల రూపాయల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే.

జాతీయం

బాధితుల సహాయార్థం అన్ని చర్యలు తీసుకోండి

సుప్రీంకోర్టు ఢిల్లీ : వరద బాధితుల సహాయార్థం అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్రం, ఉత్తరాఖండ్‌ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు అదేశాలు జారీ చేసింది. బాధితులను తరలించేందుకు అవసరమైన హెలికాప్టర్లు సమకూర్చాలని సర్వోన్నత న్యాయస్థానం అధికారులను అదేశించింది. చేపట్టిన సహాయ, పునరావాస…

తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యేకు గాయాలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): చేవెళ్ల ఎమ్మెల్యే రత్నం వాహనాన్ని ఓ టిప్పర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యేకు స్వల్పగాయలైనట్లు సమాచారం. గండిపేటలోని సీబీఐటీ కాలేజీ వద్ద దుర్ఘటన చోటుచేసుకుంది.

తెలంగాణ

ఐదుగురు నిజామాబాద్‌ జిల్లావాసుల గల్లంతు

నిజామాబాద్‌ జిల్లా : ఉత్తరకాశీ యాత్రకు వెళ్లిన ఐదుగురు కామారెడ్డి వాసులు గల్లంతైనట్లు సమాచారం. ఈ నెల 9న ఉత్తర కాశీ యాత్రకు వెళ్లిన మురళీధర్‌, గంగమణి, భాస్కర్‌, విజయ, రవిల ఆచూకీ తెలియడం లేదని బంధువులు పేర్కొన్నారు.

జాతీయం

తొలి వికెట్‌ కోల్పోయిన శ్రీలంక

కార్డిఫ్‌,(జనంసాక్షి): ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫిలో భాగంగా భారత్‌-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న సెకండ్‌ సెమీ ఫైనల్స్‌ మ్యాచ్‌లో శ్రీలంక తొలి వికెట్‌ కోల్పోయింది. ఆరు పరుగుల వద్ద భువనేశ్వర్‌ బౌలింగ్‌లో కుషాల్‌ పెరీరా నాలుగు పరుగుల వ్యక్తిగత స్కోరు…