Friday, 6 November 2026

June 2013

జాతీయం

నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్‌ మార్కెట్లు

ముంబై, స్టాక్‌ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ప్రారంభమైనాయి. సెన్సెక్స్‌ 60 పాయింట్లకు పైగా నష్ట పోయింది. నిఫ్టీ కూడా 20 పాయింట్లకు పైగా నష్టపోయి ట్రేడవుతున్నాయి.

జాతీయం

అద్వానీని కలిసిన నరేంద్ర మోడీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): బీజేపీ ప్రచార రథసారథిగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారి మోడీ హస్తినలో అడుగుపెట్టారు. గుజరాత్‌ సీఎం నరేంద్రమోడీ ఇవాళ బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీని కలిశారు. ఇవాళ అద్వానీ నివాసానికి వెళ్లిన నరేంద్రమోడీ అద్వానీతో బీజేపీలోని తాజా…

జాతీయం

ఎన్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం ఆస్తులపై ఐటీ దాడులు

చెన్నె: చెన్నైలోని ఎఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయానికి చెందిన ఆస్తులపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. విశ్వవిద్యాలయానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఏక కాలంలో 47 చోట్ల ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.

తెలంగాణ

దిల్‌షుక్‌నగర్‌లో పాఠశాలకు బాంబు బెదిరింపు

హైదరాబాద్‌ : దిల్‌షుక్‌నగర్‌లోని ఎస్‌. ఆర్‌ డిజీ స్కూల్‌లో బాంబు పెట్టినట్లు బెదిరింపు కాల్‌ వచ్చింది. దీంతో అప్రమతమైన పాఠశాల సిబ్బంది విద్యార్థులను బయటకు పంపి పోలీసులకు సమాచార మందించారు.బాంబుస్క్వాడ్‌ బృందం తనిఖీలు చేపట్టింది.

తెలంగాణ

సభకు హాజరు కాని మంత్రులపై సీఎం సీరియస్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): శాసనసభ సమావేశానికి హాజరుకాని మంత్రులపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఈగ్రహం వ్యక్తం చేశారు. ఛాంబర్‌లలో ఉన్న మంత్రులను సభకు రావాలని ఆహ్వానించాలని విఫ్‌లను ఆదేశించారు.

తెలంగాణ

కేసీఆర్‌ సమక్షంలో బాధ్యతలు స్వీకరించిన కేకే

హైదరాబాద్‌ : తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ సమక్షంలో తెరాస సెక్రటరీ జనరల్‌గా కె. కేశవరావు బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా తెరాస అధినేత కేసీఆర్‌ మాట్లాడుతూ…. కేశవరావు మార్గదర్శకంలో తెలంగాణ సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. తెరాస తరపున…

తెలంగాణ

సమావేశానికి ఆహ్వానిస్తే వెళ్తా: మంత్రి ప్రసాద్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ జరగబోయే తెలంగాణ ప్రాంత కాంగ్రెష్‌ ప్రజాప్రతినిధుల సమావేశానికి తనకు ఆహ్వానం అందలేదని మంత్రి ప్రసాద్‌ కుమార్‌ అన్నారు. ఒకవేళ ఆహ్వానం అందితే మాత్రం సమావేశానికి తప్పకుండా వెళ్తానని వ్యాఖ్యానించారు.

తెలంగాణ

నాగారంలో దున్నపోతు బీభత్సం

ఖమ్మం : ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం నాగారంలో దున్నపోతు బీభత్సం సృష్టించింది. అందరినీ పొడుస్తూ ఓ వ్యక్తి మృతికి కారణమైన దున్నపోతుపై పోలీసులు కాల్పులు జరిపారు.

జాతీయం

షిండేతో గవర్నర్‌ భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కేంద్ర మంత్రి సుశీల్‌కుమార్‌ షిండేతో రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ భేటీ అయ్యారు. ఇవాళ ఇద్దరు సమావేశమై రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తున్నట్లు సమాచారం.

తెలంగాణ

సంతకాల పుస్తకాన్ని సభాపతి ముందుంచిన తెదేపా

హైదరాబాద్‌: విద్యుత్‌ సమస్యపై ప్రజల నుంచి సేకరించిన కోటి సంతకాల భారీ పుస్తకాన్ని తెదేపా సభ్యులు స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ ముందుంచారు. దీంతో కోటి సంతకాలతో కూడిన భారీ పుస్తకాన్ని సిబ్బందికి ఇవ్వాలని స్పీకర్‌ సభ్యులకు సూచించారు. అనంతరం…