Friday, 6 November 2026

June 2013

జాతీయం

ఉత్తర కాశీలో చిక్కుకున్న విశాఖ వాసులు

విశాఖపట్నం : ఉత్తర కాశీలో చిక్కుకున్న తమ బంధువుల క్షేమ సమాచారం కోసం విశాఖవాసులు ఎదురుచూస్తున్నారు. నగరంలోని ప్రముఖ పర్యాటక క్షేత్రమైన కైలాసగిరి ప్రధాన అర్చకుడు కాశీబాబు శర్మ దంపతులు, బంధువులు ఉత్తర కాశీకి 15కిలో మీటర్ల వద్ద…

అంతర్జాతీయం

హిమాచల్‌లో భారీ వర్షాలు: 12మంది మృతి

సిమ్లా,(జనంసాక్షి): హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాన్ని వరదు ముంచెత్తుతున్నాయి. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు పొంగి పోర్లుతున్నాయి. ఇప్పటి వరకు వర్షాల కారణంగా పన్నెండు మంది మృతిచెందారు. మరి కొంత మంది నిరాశ్రయులయ్యారు.

తెలంగాణ

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో హెల్ప్‌లైన్‌

హైదరాబాద్‌ : ఉత్తర కాశీ, గంగోత్రిలో చిక్కుకున్న జిల్లా వాసుల కోసం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేశారు. బాధితుల సమాచారం కోసం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో హెల్ప్‌లైన్‌ 040 23237417,89784 66886 నెంబర్లకు ఫోన్‌ చేయాలని…

తెలంగాణ

మధ్యాహ్నం టీజేఏసీ స్టీరింగ్‌ కమిటీ భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ ఉద్యమ భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించేందుకు తెలంగాణ ఉద్యమ ఐక్య కార్యచరణ కమిటీ(జేఏసీ) భేటీ కానుంది. ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు టీ ఎన్టీవో భవన్‌లో జేఏసీ స్టీరింగ్‌ కమిటీ నేతలు సమావేశమై భవిష్యత్‌ కార్యచరణపై చర్చించనున్నారు.

తెలంగాణ

మెహదీపట్నంలో మూడు స్కూల్‌ బస్సుల సీజ్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): నిబంధనలను పాటించని స్కూల్‌ బస్సులపై ఆర్టీఏ అధికారలు కొరడా ఝళిపించారు. ఇవాళ మెహదీపట్నంలో ఆర్టీఏ అధికారులు దాడులు జరిపి సరియైన ప్రామాణికాలు పాటించిన మూడు స్కూల్‌ బస్సులను సీజ్‌ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తెలంగాణ

కోలుకొండపల్లిలో దారుణం

వరంగల్‌ : దేవరుప్పల మండలం కోలుకొండలో నిప్పంటించుకుని ఇద్దరు పిల్లలు సహా తల్లి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటనలో తల్లీకొడుకు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది.

తెలంగాణ

అసెంబ్లీలో నేటి వాయిదా తీర్మానాలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): శాసన సభలో ఇవాళ విపక్షాలు పలు అంశాలపై వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టనున్నాయి. విద్యుత్‌ ఛార్టీల పెంపు, విద్యుత్‌ కోతలపై వైఎస్సార్సీపీ, భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై సీపీఐ, వికలాంగుల సమస్యలపై సీపీఎం, విద్యుత్‌ సమస్యలపై టీడీపీలు వాయిదా…

అంతర్జాతీయం

బీహార్‌లో భాజపా బంద్‌ ఉద్రిక్తం

పాట్నా : జేడీయూ తీరును నిరసిస్తూ బీహార్‌లో భాజపా చేపట్టిన బంద్‌ ఉద్రిక్తంగా మారింది. బంద్‌ సందర్భంగా భాజపా-జేడీయూ మద్దతుదారుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో పలువురు జేడీయూ, భాజపా కార్యకర్తలు గాయపడ్డారు. రాష్ట్ర మంతటా…

తెలంగాణ

టీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించనున్న కేకే

హైదరాబాద్‌,(జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ నేత కే కేశవరావు ఇవాళ టీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశశేఖర్‌ సమక్షంలో తెలంగాణ భవన్‌లో ఉదయం పదకొండు గంటలకు జరిగే కార్యక్రమంలో ఆయన పార్టీ పదవీ బాధ్యతలు స్వీకరిస్తూ…

జాతీయం

అద్వానీతో నరేంద్రమోడీ భేటీ

న్యూఢిల్లీ : భాజపా ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడి తొలిసారిగా ఢిల్లీ వచ్చారు. ఆ పార్టీ అగ్రనేత ఎల్‌, కె అద్వానీతో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. అనంతరం రాజ్‌నాథ్‌ సింగ్‌తో…