సాయంత్రం సోనియాతో టీ కాంగ్ నేతల భేటీ
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై నిర్ణయం వెలువడినా తెలంగాణ ప్రాంత నేతలు ఇంకా హస్తినాలోనే మకాం వేశారు. ఇవాళ సాయంత్రం వాళ్లు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధి సమావేశం కానున్నారు.
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై నిర్ణయం వెలువడినా తెలంగాణ ప్రాంత నేతలు ఇంకా హస్తినాలోనే మకాం వేశారు. ఇవాళ సాయంత్రం వాళ్లు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధి సమావేశం కానున్నారు.
న్యూఢీల్లీ: వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రమంత్రి గులాంనబీ ఆజాద్ వెల్లడించారు.బిల్లు ఆమోదం పొందేందుకు అందరు సహకరించాలని ఆయన కోరారు. సీమాంద్రనేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని ఆయన సూచించిరు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం…
హైదరాబాద్: తుదివిడత పంచాయతీ ఎన్నికల్లో ఇప్పటి వరకు 64.1 శాతం పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది, మహబూబ్‌నగర్ జిల్లాలో తక్కువగా 51.8 శాతం ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 76.7 పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
హైదరాబాద్: క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డితో సీమంధ్ర మంత్రుల భేటీ ముగిసింది. సీమాంధ్ర నేతలు రేపు మంత్రుల నివాస ప్రాంగణంలో సమావేశమై భవిష్యత్ కార్యచరణపై నిర్ణయం ప్రకటించనున్నట్లు సమాచారం.
లక్నో: కేంద్ర ప్రభుత్వం ఉత్తర ప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. తెలంగాఱ రాష్ట్ర ఏర్పాటును స్వాగతిస్తున్నట్లు చెప్పారు. మొదట్నుంంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగానే ఉన్నట్లు మాయావతి చెప్పారు.
ఢిల్లీ: సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు ఇవాళ ఢిల్లీలో సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యచరణపై వీరంతా చర్చిస్తున్నట్లు సమాచారం.
గుంటూరు: జిల్లాలోని పెద్దిరెడ్డిపాలెంలో స్థానికులు బ్యాలెట్ బాక్సులు ఎత్తుకెళ్లారు. అడ్డుకున్న పోలీసులపై దాడి చేసి, పోలింగ్ కేంద్రాలపై రాళ్లు వర్షం కురిపించారు. దీంతో గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.
హైదరాబాద్: క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డితో సీపీఐ కార్యదర్శి నారాయణ భేటీ అయ్యారు.
భోపాల్: ఉమ్మడి రిజధాని అంశంపై తప్పుుగా అర్థం చేసుకోవద్దని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహరాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ విజ్ఞప్తి చేశారు. భోపాల్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ తెలంగాణ రాజధానిగానే ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణ బిల్లు త్వరగా…
రాయలసీమ మంత్రుల నివాస ప్రాంగణంలో రాయలసీమ ప్రాంతానికి చెందిన మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యిరు. వీరంతా భవిష్యత్తు కార్యచరణ పై చర్చిస్తున్నట్లు సమాచారం.