Thursday, 5 November 2026

July 2013

తెలంగాణ

విద్యుత్‌ షాక్‌తో సర్పంచ్‌ అభ్యర్థిని మృతి

వరంగల్‌,(జనంసాక్షి): జిల్లాలోని నర్సింహులపేట మండలంలో వంతడుపుల గ్రామంలో విద్యుత్‌షాక్‌తో తల్లి కూతురు మృతి చెందారు. మృతుల్లో రోజ(22) సర్పంచ్‌ అభ్యర్థినిగా పోటీలో బరిలో నిలిచింది. ఆమెను రక్షించే ప్రయత్నంలో తల్లి కూడా మరణించింది. ఇంట్లో విద్యుత్‌ బల్బును సరిచేస్తూ…

జాతీయం

శాకాంబరి దేవిగా శ్రీశైల భ్రమరాంబ

శ్రీశైలం: కర్నూలు జిల్లా శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జున అలయంలో ఆషాడ పౌర్ణమి పురస్కరించుని సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భ్రమరాంబదేవికి శాకాంబరి ఉత్సవాన్ని వైభంగా నిర్వహించారు. దేవి మూలమూర్తి, ఉత్సవమూర్తులతో పాటు ఆలయ ప్రాంగణంలోని వివిధ దేవతా మూర్తులను…

సీమాంధ్ర

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

విశాఖ,(జనంసాక్షి): వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్లు విశాఖలలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీని కారణంగా రాష్ట్రంలో బలమైన గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

ఖమ్మం

ఐదు ఓసీలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

ఖమ్మం,(జనంసాక్షి): ఎడతెరిపిలేని వర్షం కారణంగా జిల్లాలో ఐదు ఓపెన్‌కాస్టుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 51 అడుగులకు చేరుకుంది.

తెలంగాణ

ప్రారంభమైన ఎంబీబీఎన్‌, బీడీఎన్‌ కౌన్సెలింగ్‌

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సులకు ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభమైంది. సోమవారం నుంచి ఈనెల 29 వరకు కౌన్సెలింగ్‌ జరగనుంది. హైదరాబాద్‌, విశాఖపట్నం , విజయవాడ , తిరుపతి కేంద్రాల్లో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు.

తెలంగాణ

భారీ వర్షం వల్ల 13గేట్లు ఎత్తివేత

మహబూబ్‌నగర్‌ : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చిచేరుతోంది. జలాశయం  నీటిమట్టం 317.6 అడుగులకు చురుకుంది. దీంతో 13 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల జలాశయంలో ఇన్‌ఫ్లో 1,00,892…

తెలంగాణ

కూకట్‌పల్లిలో భారీగా స్తంభించిన ట్రాఫిక్‌

హైదరాబాద్‌: నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ ఉదయం నుంచి వర్షం పడుతోంది. కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లిలో వర్షం కారణంగా భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. దీంతో ఉదయం కార్యాలయాలకు, విద్యా సంస్థలకు గురయ్యారు.

జాతీయం

ఎన్నికల సిబ్బందిని బెదిరించిన మావోయిస్టులు

విశాఖ జిల్లా : పోలింగ్‌ బూత్‌ను వదిలి వెళ్లాలంటూ విశాఖ జిల్లా జి. మాడుగుల ఎంపీడీవో కార్యాలయంలో ఆదివారం రాత్రి మావోయిస్టులు ఎన్నికల సిబ్బందిని బెదిరించారు. మావోయిస్టుల బెదిరింపుల దృష్యా పోలీసులు ఎన్నికల సిబ్బందికి భారీగా భద్రత కల్పిస్తున్నారు.

జాతీయం

ఎన్నికల సిబ్బందిని బెదిరించిన మావోయిస్టులు

విశాఖ జిల్లా : పోలింగ్‌ బూత్‌ను వదిలి వెళ్లాలంటూ విశాఖ జిల్లా జి. మాడుగుల ఎంపీడీవో కార్యాలయంలో ఆదివారం రాత్రి మావోయిస్టులు ఎన్నికల సిబ్బందిని బెదిరించారు. మావోయిస్టుల బెదిరింపుల దృష్యా పోలీసులు ఎన్నికల సిబ్బందికి భారీగా భద్రత కల్పిస్తున్నారు.

Cartoons

elections – cartoon

మన అభ్యర్థే పోలింగ్‌ వాయిదా పడింది ఇప్పటికే ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేశాడట.