Thursday, 5 November 2026

July 2013

కరీంనగర్

తుమ్మల చెరువుకు గండి

కరీంనగర్‌,(జనంసాక్షి): జిల్లాలో వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. సైదాపూర్‌ మండలం బెనికేపల్లి గ్రామంలోని తుమ్మల చెరువుకు రెండు చోట్ల గండి పడింది. దీంతో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

కరీంనగర్

జిల్లాలో హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలు

కరీంనగర్‌,(జనంసాక్షి): జిల్లాలో గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు పలు గ్రామాలు నీటమునిగాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ముంపునకు గురైన గ్రామాల్లో సహాయక చర్యల కోసం కరీంనగర్‌లోని కలెక్టర్‌ కార్యాలయానికి…

తెలంగాణ

ప్రవాహంలో కొట్టుకుపోయి విద్యార్థి మృతి

నిజామాబాద్‌,(జనంసాక్షి): జిల్లాలోని కామారెడ్డి పెద్ద చెరువు వద్ద వరద ప్రవాహంలో కొట్టుకుపోయి ఓ విద్యార్థి మృతి చెందాడు. అతన్ని దేవునిపల్లికి చెందిన లక్ష్మన్‌గా గుర్తించారు.

సీమాంధ్ర

కుమారుడితో సహా దంపతులు ఆత్మహత్య

అనంతపురం,(జనంసాక్షి): జిల్లాలోని గోరంట్ల మండలంలోని గంగంపల్లిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య జరిగిన ఘర్షణతో ఓ కుటుంబం నిప్పంటించుకుంది. ఈ ఘటనలో భార్యా కుమారుడు మృతి చెందగా భర్త పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం…

తెలంగాణ

నిలిచిపోయిన రైళ్ల రాకపోకలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): నాగపూర్‌లో భారీ వర్షాల కారణంగా రైల్వే ట్రాక్‌ పూర్తిగా దెబ్బతింది. దీంతో ఢిల్లీ- హైదరాబాద్‌ల మధ్య నడిచే రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అందులో భాగంగా ఏపీ, సంపర్క్‌ క్రాంతి, పాట్నా ఎక్స్‌ప్రెస్‌లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

తెలంగాణ

విద్యాధరరావు మృతి పట్ల చంద్రబాబు సంతాపం

హైదరాబాద్‌,(జనంసాక్షి): మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు హఠాన్మరణంపై తెదేపా అధినేత చంద్రబాబునాయుడు సంతాపం ప్రకటించారు. ఎంపీ హరికృష్ణతోపాటు పలువురు తెదేపా నేతలు ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.

వార్తలు

లంక గ్రామాల్లో పర్యటిస్తున్న కలెక్టర్‌

తూర్పుగోదావరి,(జనంసాక్షి): గోదావరి వరద ఉద్దృతికి కోనసీమ లంక గ్రామాలు ముంపునకు గురయ్యాయి. పరిస్టిథితిని సమీక్షించడానికి జిల్లా కలెక్టర్‌ నీతూ ప్రసాద్‌ పడవలో లంక గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు.

తెలంగాణ

విద్యాధరరావు మృతి పట్ల పలువురి నేతల సంతాపం

హైదరాబాద్‌,(జనంసాక్షి): మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు మృతి పట్ల పలువురు నేతలు సంతాపం ప్రకటించారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ,మంత్రి కన్నా లక్ష్మీనారాయణ సంతాపం తెలిపి ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

సీమాంధ్ర

ఇన్నోవా భీభత్సవం: ఏఎస్‌ఐ మృతి

పామర్రు,(జనంసాక్షి): కృష్ణాజిల్లా పామర్రు చెక్‌పోస్ట్‌ వద్ద ఓ ఇన్నోవా వాహనం బీభత్సవం సృష్టించింది. ఈ రోజు ఉదయం ఇన్పోవా కారు అదుపు తప్పి చెక్‌పోస్ట్‌లోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో విధులు నిర్వహిస్తున్న ఏఎస్‌ఐ ప్రసాద్‌ అక్కడికక్కడే మృతి చెందాడు.…

తెలంగాణ

నేడు హైదరాబాద్‌కు రానున్న యూపీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): హైదరాబాద్‌ ఉత్తరప్రదేశ్‌ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ శనివారం హైదరాబాద్‌కు వస్తున్నారు. ఆదివారం జరిగే అఖిల భారత యాదవ మహాసభకు కార్యవర్గ సమావేశంలో పాల్గొనడానికి ఆయన నగరానికి వస్తున్నారని సమాజ్‌వాదీపార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జగదీష్‌ యాదవ్‌ తెలిపారు.…