Thursday, 5 November 2026

July 2013

తెలంగాణ

బీపీ ఆచార్య బంధువు అవినాష్‌ అరెస్ట్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఐఏఎస్‌ అధికారి, ఎంఆర్‌ కేసు నిందితుడు బీపీ ఆచార్య బంధువు అవినాష్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. బంగారం అమ్ముతామంటూ రూ. కోటి మేర మోసం చేసిన అవినాష్‌ తో సహా 9 మందిని అల్వాల్‌లో పోలీసులు అరెస్ట్‌…

తెలంగాణ

అధికార లాంఛనాలతో కోటగిరి అంత్యక్రియలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి శనివారం నిర్ణయించారు. ఈ మేరకు పశ్చిమగోదావరి జిల్లా అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. అయితే కోటగిరి…

ఖమ్మం

శాంతించిన గోదావరి నది

ఖమ్మం,(జనంసాక్షి): భద్రాచలం వద్ద గోదావరి వరద ఉద్దృతి క్రమంగా తగ్గుతుంది. 9 గంటలకు 56.4 అడుగులుగా ఉన్న నీటి మట్టం 11 గంటలకు 56.4 మరి కొద్ది సేపట్లో నీటి మట్టం 56 అడుగులకు చేరే అవకాశం ఉందని…

తెలంగాణ

బంజారాహిల్స్‌లో విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్‌,(జనంసాక్షి): బంజారాహిల్స్‌లో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓ ప్రైవేట్‌ స్కూల్లో 6 వతరగతి చదువుతున్న విద్యార్థి స్వామి ప్రిన్సిపల్‌ మందలించాడని ఆత్మహత్యకు పాల్పడ్డాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.

తెలంగాణ

జానా నివాసంలో టీ ఎంపీల భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్రమంత్రి జానారెడ్డి నివాసంలో టీ కాంగ్రెస్‌ ఎంపీలు సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పటుపై సీఎం, పీసీసీ అధ్యక్షుడు బొత్స ఇస్తున్న లీకులపై వీరు చర్చిస్తున్నట్లు సమాచారం.

సీమాంధ్ర

స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం

విశాఖపట్నం,(జనంసాక్షి): రాగల 24 గంటల్లో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలో తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుంది. ఒడిషా నుంచి దక్షిణ తమిళనాడు…

తెలంగాణ

తెగిన నల్లవాగు వంతెన: నిలిచిన రాకపోలు

నిజామాబాద్‌,(జనంసాక్షి): భారీ వర్షాలు నిజామాబాద్‌ జిల్లాలో బీభత్సవం సృష్టిస్తున్నాయి. పిట్లం మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామంలో వరద ఉద్దృతికి నల్లవాగు వంతెన దెబ్బతింది. దీంతో పలుగ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

తెలంగాణ

భారీ వర్షాలు, విపత్తు నిర్వహణపై సీఎం సమీక్ష

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్రంలో భారీ వర్షాలు, విపత్తు నిర్వహణపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాల్లో చేపడుతున్న సహాయక చర్యలపై జిల్లా అధికారులతో చర్చించారు.

తెలంగాణ

అల్వాల్‌లో దోపిడి ముఠాను అరెస్ట్‌ చేసిన పోలీసులు

హైదరాబాద్‌,(జనంసాక్షి): అల్వాల్‌లో దోపిడి ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి రూ. కోటిన్నర నగదు స్వాధీనం చేసుకున్నారు. ముఠా నాయకుడు మాజీ ఐఏఎస్‌ అధికారి కుమారుడిగా పోలీసులు తెలిపారు.