Wednesday, 4 November 2026

August 2013

జాతీయం

మీడియా శత్రుభావంతో వ్యవహరించవద్దు : సోనియాగాంధీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ప్రభుత్వం పట్ల మీడియా శత్రుభావంతో వ్యవహరించొద్దు అని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ కోరారు. ఢిల్లీలో జాతీయ మీడియా కేంద్రాన్ని సోనియా గాంధీ, ప్రధాని యన్మోహన్‌సింగ్‌ ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్మాణాత్మకమైన విమర్శలు చేస్తే ఆహ్వానిస్తామని ఆమె…

తెలంగాణ

లొంగిపోయిన మావోయిస్టు దంపతులు

హైదరాబాద్‌,(జనంసాక్షి): వరంగల్‌ పోలీసుల ఎదుట ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మావోయిస్టు దంపతులు లొంగిపోయారు. మాడివి దులాలాం, కడియం పొజ్జె అలియాస్‌ సునీత పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాణిబోధి క్యాంప్‌పై దాడి చేసిన కేసులో వీరు నిందితులు.

వార్తలు

గంగానదిలో వ్యాన్‌ బోల్తా : 23 మంది గల్లంతు

లక్నో,(జనంసాక్షి): ఉత్తరప్రదేశ్‌లోని భరూచ్‌ జిల్లాలోని గగరా నదిలో అదుపు తప్పి వ్యాను బోల్తా పడింది. ఈ ప్రమాదంల 23 మంది కూలీలు గల్లంతయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

తెలంగాణ

రైళ్లలో చోరి చేస్తున్న దొంగల ముఠా అరెస్టు

హైదరాబాద్‌,(జనంసాక్షి): రైళ్లలో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను వరంగల్‌ జిల్లా కాజీపేట రైల్వేస్టేషన్‌లో పోలీసులు అదుపులకి తీసుకున్నారు. కాజీపేటలో చోరి చేస్తుండగా నలుగురు సభ్యులు ఉన్న దొంగల ముఠాను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

జాతీయం

జాతీయ మీడియా కేంద్రం ప్రారంభం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): జాతీయ మీడియా కేంద్రాన్ని ప్రధాని మన్మోహన్‌సింగ్‌, యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా సోనియా మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలపై నిర్మాణాత్మక విమరశలు చేస్తే ఆహ్వానిస్తామన్నారు.

తెలంగాణ

రేపు తెలంగాణ కవుల యాక్షన్‌ ప్లాన్‌ : గౌరీశంకర్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): పార్లమెంట్‌లో వెంటనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర బిల్లును ప్రవేశపెట్టాలని, హైదరాబాద్‌తో కూడిన 10 జిల్లాల తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 25 వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు సిరిసిల్లలో కవులు ,…

తెలంగాణ

26, 27 తేదీల్లో బీసీల మహా ధర్నా

హైదరాబాద్‌,(జనంసాక్షి): అన్ని రంగాల్లో వెనుకబడిన బీసీలకు న్యాయం జరగాలంటే బీసీ సబ్‌ప్లాన్‌ను రూపొందించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 26, 27 తేదీల్లో నగరంలోని ఇందిరాపార్క్‌ వద్ద మహాధర్నాను నిర్వహించనున్నట్లు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు డాక్టర్‌ కే.లక్ష్మణ్‌…

వార్తలు

ఐబీఎల్‌లో నేడు

పుణె: ఐబీఎల్‌లో భాగంగా ఇవాళ అవధె వారియర్స్‌, ముంబాయియమాస్టర్స్‌ జట్లు తలపడనున్నాయి. రాత్రి 8గంటల నుంచి మ్యాచ్‌ ఈఎస్‌పీఎస్‌లో ప్రసారమవుతుంది.

వార్తలు

కొనసాగుతున్న ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు

హైదరాబాద్‌: కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు  కొనసాగుతోంది. నాలుగో రౌండ్‌ పూర్తయ్యే సరికి తెదేపా అభ్యర్ధి అంబటి శ్రీహరి ప్రసాద్‌ 12,226 ఓట్ల అధిక్యంలో ఉన్నారు.