Wednesday, 4 November 2026

August 2013

తెలంగాణ

సీఎంతో ఏపీ ఎన్టీవోల సమావేశం

హైదరాబాద్‌,(జనంసాక్షి): సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీ ఎన్టీవోల నేతలు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో సమావేశమయ్యారు. ఏపీఎన్టీవోల ఆందోళనలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో సీఎంతో ఏపీ ఎన్టీవోల నేతలు సమావేశం కావడం ప్రధాన్యతను సంతరించుకుంది. మరో పక్క తెలంగాణ…

తెలంగాణ

ఏసీబీ వలలో వ్యవసాయశాఖ ఏడీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల వ్యవసాయ శాఖ ఏడీ నాగమణమ్మ అవినీతి నిరోధక శాఖ వలలో చిక్కారు. రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా ఆమెను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

తెలంగాణ

సచివాలయంలో టీ ఉద్యోగుల శాంతి ర్యాలీ

హైదరాబాద్‌,(జంనసాక్షి): రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ ఉద్యోగులు శాంతి ర్యాలీ ప్రారంభించారు. విడిపోయి కలిసిఉందామని సీమాంధ్ర ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు. మరోపక్క రాష్ట్ర సీమాంధ్ర ఉద్యోగులు సమైక్యాంధ్ర కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.

అంతర్జాతీయం

యూఎస్‌ ఓపెన్‌ నుంచి తప్పుకున్న షరపోవా

న్యూయార్క్‌,(జనంసాక్షి): భుజానికి అయిన గాయం కారణంగా టెన్నిస్‌ క్రీడాకారిణి మరియా షరపోవా యూఎస్‌ ఓపెన్‌ నుంచి తప్పుకున్నారు. 2006 ఛాపియన్‌ అయిన షరపోవా  గాయం కారణంగా తప్పుకుంటున్నట్లు యూఎస్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ ప్రకటించింది.

జాతీయం

హరికృష్ణ రాజీనామా ఆమోదించిన హమీద్‌ అన్సారీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): టీడీపీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ రాజీనామాను రాజ్యసభ ఛైర్మన్‌ హమీద్‌ అన్సారీ ఆమోదించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయంకు నిరసనగా హరికృష్ణ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన రాజీనామాను ఆమోదించినందుకు హరికృష్ణ…

తెలంగాణ

అగ్ని ప్రమాదంలో కిరాణా దుకాణం దగ్ధం

కాప్రా,(జనంసాక్షి): హైదరాబాద్‌ ఓల్డ్‌ కాప్రాలోని బంజారాకాలనీలో మల్లుష్‌ కిరాణా దుకాణంలో బుధవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు రూ. 2 లక్షల ఆస్తినష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు. విద్యుత్‌షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం జరిగింది.

జాతీయం

లోక్‌సభ రేపటికి వాయిదా

న్యూఢిల్లీ,(జనంసాక్షి): పార్లమెంట్‌లో ఆందోళనకు దిగిన 11 మంది సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్‌ వేటు నిర్ణయాన్ని బీజేపీ పార్లమెంట్‌ పార్టీ నేత సుష్మాస్వరాజ్‌ వ్యతిరేకించడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్‌ సభను రేపటికి వాయిదా వేశారు.

జిల్లా వార్తలు

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

కొండపాక,(జనంసాక్షి): మెదక్‌జిల్లా కొండపాక మండలం లకుడారం శివారులోని రాజీవ్‌ రహదారిపై ద్విచక్రవాహనం, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో శ్రీశైలం (55) తీవ్రంగా గాయపడి సిద్దిపేట ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. కుకునూరు పల్లి పోలీసులు కేసు నమోదు…

ఆదిలాబాద్

మంచిర్యాల పట్టణంలో చైన్‌స్నాచింగ్‌

ఆదిలాబాద్‌,(జనంసాక్షి): మంచిర్యాల పట్టణంలోని శ్రీనివాస టాకిస్‌ రోడ్డులో చైన్‌స్నాచింగ్‌ జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న మహిళ మెడలోంచి బైక్‌పై వచ్చిన దుండగులు ఐదు తులాల బంగారు గొలుసును లాకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు…

జాతీయం

దాభోల్కర్‌ హత్య దారుణం : శుక్లా

న్యూఢిల్లీ,(జనంసాక్షి): పుణేలో హేతువాది నరేంద్ర దాభోల్కర్‌ హత్య దారుణమని పార్లమెంట్‌ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ శుక్లా అన్నారు. దాభోల్కర్‌ హత్యకేసు దర్యాప్తులో మహారాష్ట్ర ప్రభుత్వానికి సాయం చేస్తామని ఇవాళ రాజ్యసభలో ప్రకటించారు.