Wednesday, 4 November 2026

August 2013

తెలంగాణ

చెత్త కుండిలో అప్పుడే పుట్టిన శిశువు

హైదరాబాద్‌,(జనంసాక్షి): సికింద్రాబాద్‌లోని వాసవీనగర్‌లో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన శిశువును చెత్తకుండిలో పడేసి వెళ్లారు. పందులూ, కుక్కలు గుమికూడటంతో అక్కడ శిశువు ఉన్న సంగతి గుర్తించిన స్థానికులు జంతువులను అదిలించి శిశువును రక్షించారు. అనంతరం…

తెలంగాణ

ఇందిరాపార్క్‌ వద్ద టీ జేఏసీ శాంతి దీక్ష

హైదరాబాద్‌,(జనంసాక్షి): పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టాలని సీమాంధ్రులు విధ్వేషాలు వీడి రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలని కోరుతూ తెలంగాణ రాజకీయ జేఏసీ ఇందిరాపార్క్‌ వద్ద శాంతి దీక్ష చేపట్టింది. దీక్షలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కూర్చున్నారు. దీక్షను టీఆర్‌ఎస్‌…

తెలంగాణ

రూ. 600 పెరిగిన బంగారం ధర

హైదరాబాద్‌,(జనంసాక్షి): రూపాయి పతనంతో బంగారం ధర నగరంలోని బులియన్‌ మార్కెట్లో ఒక్కరోజే రూ. 600 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 31,413లు పెరిగింది.

జాతీయం

సీబీఐ కోర్టుకు చేరుకున్న అనిల్‌ అంబానీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రిలియన్స్‌ అడాగ్‌ అధ్యక్షుడు అనిల్‌ అంబానీ ఢిల్లీలోని సీబీఐ కోర్టుకు చేరుకున్నారు. 2జీ కేసులో అనిల్‌ సాక్షిగా ఉన్నారు.

జాతీయం

గంటపాటు వాయిదా పడిన లోక్‌సభ

ఢిల్లీ,(జనంసాక్షి): బొగ్గు కుంభకోణం ఫైళ్లు మాయం కావడంపై లోక్‌సభలో విపక్షాలు ఆందోళన చేపట్టారు. సభ నిర్వహించడం కష్టం కాండంతో స్పీకర్‌ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.

జాతీయం

భారత్‌పై కాల్పులకు తెగబడ్డ పాక్‌సైన్యం

జమ్మూకాశ్మీర్‌,(జనంసాక్షి): పాక్‌ సైన్యం మరోమారు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. నిన్న రాత్రి పూంచ్‌ సెక్టార్‌లోని హమీర్‌పూర, మేంధర్‌లో పాక్‌ సైన్యం కాల్పులు జరిపింది. భారత సైన్యం ఈ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది.

జాతీయం

రాజ్యసభ 15 నిమిషాలు వాయిదా

ఢిల్లీ,(జనంసాక్షి): రాజ్యసభలో బొగ్గు కుంభకోణం సంబంధించిన ఫైళ్ల మాయంపై విపక్షాలు ఆందోళన చేశాయి. దీంతో సభ గందరగోళం నెలకొంది. రాజ్యసభను ఛైర్మన్‌ 15 నిమిషాలు వాయిదా వేశారు.

జాతీయం

నేడు ఐబీఎల్‌లో జరిగే మ్యాచ్‌లు

ముంబయి,(జనంసాక్షి): ఐబీఎల్‌లో భాగంగా ఈ రోజు సాయంత్రం 4 గంటలకు జరిగే మ్యాచ్‌లో హైదరాబాద్‌ షాట్స్‌తో ముంబయి మాస్టర్స్‌ తలపడనుంది. మరో మ్యాచ్‌లో అవధేవారియర్స్‌తో ఢిల్లీ స్మాషర్స్‌ తలపడనుంది. సాయంత్రం 4 గంటల నుంచి ఈఏస్‌పీన్‌లో మ్యాచ్‌ ప్రసారం…