Monday, 2 November 2026

August 2013

తెలంగాణ

సీఎం కిరణ్‌ను కాంగ్రెస్‌ వెంటనే బర్తరఫ్‌ చేయాలి : హరీష్‌రావు

వరంగల్‌,(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడితే సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డిని తెలంగాణ పొలిమేర దాటుదాక తరిమికొడతామని టీఆర్‌ఎస్‌ శాసనసభ పక్ష ఉపనేత టి. హరీష్‌రావు హెచ్చరించారు. కిరణ్‌కుమార్‌రెడ్డికి ఒక్క నిమిషం ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే హక్కు లేదని హరీష్‌…

తెలంగాణ

నకిలీ మందులు విక్రయిస్తున్న వ్యక్తుల అరెస్టు

హైదరాబాద్‌,(జనంసాక్షి):హైదరాబాద్‌ నగరంలో నకిలీ మందులను విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు  శుక్రవారం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారి నుంచి సుమారు 3 టన్నుల ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

తెలంగాణ

చీము నెత్తురు ఉంటే సీఎం రాజీనామా చేయాలి : శంకర్‌రావు

హైదరాబాద్‌,(జనంసాక్షి): చీమూ నెత్తురు ఉంటే సీఎం కిరణ్‌ తక్షణమే రాజీనామా చేయాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే శంకర్‌రావు అన్నారు. హైకమాండ్‌ను ధిక్కరిస్తే సీఎం కిరణ్‌కు సెలవు ప్రకటిస్తారని అహంకారంతో సీఎం మాట్లాడుతున్నాడని శంకర్‌రావు ధ్వజమెత్తారు.

జాతీయం

ఆర్థిక సంక్షోభానికి ప్రభుత్వ అసమర్థతే కారణం : అద్వానీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): దేశంలోని ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొవడంలో ప్రస్తుతం అనిశ్చితికి కేంద్ర ప్రభుత్వ అసమర్థతే కారణమని భాజపా అగ్రనేత ఎల్‌కే అద్వానీ అన్నారు. విపక్షాలను విమర్శిస్తూ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ చేసిన వ్యాఖ్యలు తమను బాధించినట్లు ఆయన చెప్పారు.

తెలంగాణ

హైదరాబాద్‌ కేసులోనే భత్కల్‌ అరెస్టు : ఎన్‌ఐఏ

హైదరాబాద్‌,(జనంసాక్షి): హైదరాబాద్‌ కుట్ర కేసులోనే మోస్ట్‌ వాంటెడ్‌ భత్కల్‌ను అరెస్టు చేసునట్లు ఎన్‌.ఐ.ఏ తెలిపింది. అసదుల్లా అక్తర్‌తో కలిసి భత్కల్‌ హైదరాబాద్‌ పేలుళ్ల కుట్ర చేసాడని ఎన్‌.ఐ.ఏ పేర్కొంది. హైదరాబాద్‌ ప్రాంతాల్లో పేలుళ్లకు భత్కల్‌ రిక్కీ చేశాడని ఎన్‌.ఐ.ఏ…

జాతీయం

లోక్‌సభ సోమవారానికి వాయిదా

ఢిల్లీ,(జనంసాక్షి): వాయిదా అనంతరం మూడు గంటలకు ప్రారంభమైన లోక్‌సభలో సీమాంధ్ర ఎంపీల ఆందోళన కొనసాగింది. దాంతో స్పీకర్‌ సభను సోమవారానికి వాయిదా వేశారు.

వార్తలు

మరోమారు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిన పాక్‌

జమ్మూ,(జనంసాక్షి): రెండు రోజుల తర్వాత పాక్‌ బలగాలు మరోసారి నియంత్రణ రేఖ వద్ద కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. జమ్మూ జిల్లాలోని పల్లన్‌వాలా సబ్‌ స్టేషన్‌ వద్ద గురువారం రాత్రి 11.30 ప్రాంతంలో కాల్పులు జరిపిందని భరత సీనియర్‌ ఆర్మీ…

తెలంగాణ

జై తెలంగాణ నినాదాలతో మార్మోగుతున్న సచివాలయం

హైదరాబాద్‌,(జనంసాక్షి): జై తెలంగాణ నినాదాలతో సచివాలయం మార్మోగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్‌ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు పెట్టాలని తెలంగాణ ఉద్యోగులు విధులు బహిష్కరించి జై తెలంగాణ నినాదాలు చేశారు. పోటీగా సీమాంధ్ర ఉద్యోగులు విభజన నిర్ణయాలన్ని…

జాతీయం

యూఎస్‌ ఓపెన్‌లో ఫెస్‌ జోడి విజయం

న్యూయార్క్‌,(జనంసాక్షి): యూఎస్‌ ఓపెన్‌లో లియండర్‌ ఫేస్‌ జోడి విజయం సాధించింది. స్టెపనాక్‌తో జతకట్టిన ఫెస్‌ తొలి రౌండ్లో జార్‌కో నయామీనన్‌, టుర్సనోవా జోడిపై 6-4, 7-6(4) తేడాతో విజయం సాధించింది.