Wednesday, 4 November 2026

October 2013

రంగారెడ్డి

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ముగ్గురు స్మగ్లర్లు అరెస్టు

రంగారెడ్డి : శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారులు ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. ముగ్గురు స్మగ్లర్ల నుంచి మూడు కిలోల బంగారంతో పాటు నకిలీ పాస్‌పోర్టులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురు వేర్వేరు విమానాల్లో వచ్చారు. వీరిని…

కరీంనగర్

నకిలీ పట్టాదారు పుస్తకాలు స్వాదీనం

కరీంనగర్‌ : సిరిసిల్లలో నకిలీ పట్టాదారు పుస్తకాలు తయారు చేస్తున్న వ్యక్తుల నివాసాలపై రెవెన్యూ అధికారులు దాడులు చేశారు. వ్యక్తుల నుంచి నకిలీ పట్టదారు పుస్తకాలు, రేషన్‌కార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

సీమాంధ్ర

అమరావతి రామలింగేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న భన్వర్‌లాల్‌

గుంటూరు : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ ఈ ఉదయం కుటుంబ సమేతంగా అమరావతి అమరలింగేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భన్వర్‌లాల్‌కు ఆలయ అధికారులుఅర్చకులు సాదర స్వాగతం పలికారు. అనంతరం స్వామి…

హైదరాబాద్

తిరుమలలో భారీ వర్షం

హైదరాబాద్‌ : తిరుమలలో భరీ వర్షం కురుస్తోంది. గత రెండు రోజులుగా తేలికపాటిగా కురుస్తున్న వర్షం ఈ ఉదయం నుంచి భారీగా కురుస్తోంది. మరోవైపు ఈదురుగాలులు భారీగా వీస్తుండడంతో చలి తీవ్రత అధికంగా ఉంది. దీంతో పిల్లలు, వృద్దులు…

ఆదిలాబాద్

బైక్‌పై నుంచి పడి వ్యక్తి మృతి

ఆదిలాబాద్‌ : మామడ మండలం కొత్త సాంఘ్వీ గ్రామానికి చెందిన నరసింహారెడ్డి అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఖానాపూర్‌ నుంచి మామడకు బైక్‌పై వెళ్తుండగా అదుపుతప్పి కిందపడి మృతి చెందాడు.

మెదక్

పటాన్‌చెరులో భారీ చోరీ : 30 తులాల బంగారం చోరీ

మెదక్‌ : పటాన్‌చెరు మండలం బీరంగూడలో భారీ చోరీ జరిగింది. ఓ ఇంట్లో 30 బంగారం, 40 తులాల వెండి చోరీకి గురైంది. ఇంటి యజమాని పిర్యాదు మేరకు పోలీసులు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

సీమాంధ్ర

తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైంది : కేంద్రమంత్రి జేడీ శీలం

విజయవాడ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని ,తీర్మానం రాష్ట్ర అసెంబ్లీకి ఎప్పుడు వస్తుందో చెప్పలేమని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రి జేడీ శీలం పేర్కొన్నారు. అవకాశం ఉన్నంత వరకూ విభజనను అడ్డుకునేందుకు యత్నిస్తానని చెప్పారు.…

జాతీయం

నేడు వెలువడనున్న విప్రో ఫలితాలు

బెంగళూర్‌ :ఐటీ వ్యాపారం మినహా ఇతర వ్యాపార విభాగాలను విభజిచడమే కాక ఐటీ ఉద్యోగుల వేతనాలు 6-8శాతం పెంచినప్పటికి రెండో త్రైమాసికానికి విప్రో మెరుగైన ఫలితాలను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. రూపాయి క్షీణత ఇందుకు ప్రధాన కారణం. సెప్టెంబర్‌తో…

జాతీయం

ఆర్‌.ఎస్‌ పురా సెక్టార్‌లో సైన్యం కాల్పులు

జమ్మూకాశ్మీర్‌ : పాక్‌ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఆర్‌.ఎస్‌.పురా సెక్టార్‌లోని అబ్దులియాన్‌ ప్రాంతంలో పాక్‌ సైన్యం కాల్పులకు తెగబడింది. పాక్‌ కాల్పులకు భారత సైన్యం తిప్పికొట్టినట్టు సమాచారం

హైదరాబాద్

నెత్తురోడిన రహదారులు :వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి మృతి

్‌ హైదరాబాద్‌ : రహదారులు రక్తసిక్తమయ్యాయి. ఈ రోజు తెల్లవారుజామున వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. పలువురు క్షతగాత్రులయ్యారు. శ్రీశైలం- హైదకాబాద్‌ ప్రధాన రహదారిపై మహబూబ్‌నగర్‌ జిల్లా ఉప్పునుంతల మండలం అయ్యవారిపల్లి వద్ద…