Wednesday, 4 November 2026

October 2013

సీమాంధ్ర

రాష్ట్రంలో చురుగ్గా కదులుతున్న ఈశాన్య రుతుపవనాలు

విశాఖ : రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు నిష్క్రమించడంతో …ఈశాన్య రుతుపవనాలు చురగ్గా కదులుతున్నాయి. ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో 24గంటల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే…

హైదరాబాద్

వేతనాలు పెంచాలంటూ కార్మికుల ర్యాలీ

హైదరాబాద్‌ : కనీస వేతనాలు పెంచాలంటూ మున్సిపల్‌ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరాపార్కు వరకు మున్సిపల్‌ కార్మికులు ర్యాలీ నిర్వహించారు.తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నిన్నటి నుంచి మున్సిపల్‌ కార్మికులు పోరుబాట…

జాతీయం

ఇద్దరు లోక్‌సభ సభ్యులపై అనర్హత వేటు

న్యూఢిల్లీ : ఇద్దరు లోక్‌సభ సభ్యులపై అనర్హత వేటు పడింది. అనర్హత వేటు పడిన వారిలో లాలూ ప్రసాద్‌ యాదవ్‌, జేడీయూ ఎంపీ జగదీశ్‌ శర్మపై అనర్హత వేటు పడింది. సుప్రీం కోర్టు తీర్పుతో అనర్హతకు గురైన మొదటి…

జాతీయం

దిగ్విజయ్‌తో మంత్రి డీకే అరుణ భేటీ

న్యూఢిల్లీ : రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌తో మంత్రి డీకే అరుణ భేటీ అయ్యారు. సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్ధితులతో పాటు తెలంగాణ అంశంపై చర్చించినట్లు సమాచారం.

హైదరాబాద్

టీడీపీలోకి పవన్‌కళ్యాణ్‌, నాగబాబును ఆహ్వానిస్తాం : యనమల రామకృష్ణుడు

హైదరాబాద్‌ : పవన్‌ కళ్యాణ్‌, నాగబాబు టీడీపీలోకి వస్తామంటే ఆహ్వానిస్తామని ఆ పార్టీ నేత యనమల రామకృష్ణుడు తెలిపారు. తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం పోరాడేందుకు టీడీపీ సరైన వేదిక అని పేర్కొన్నారు. మెగా బ్రదర్స్‌తో బాలకృష్ణ చర్చల…

హైదరాబాద్

విజయనగరంలో వైభగంగా సిరిమాను జాతర

హైదరాబాద్‌ : విజయనగరంలో సిరిమాను జాతర ఉత్సవాలు అత్యంత వైభగంగా జరుగుతున్నాయి. ఈరోజు తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైనులో బారులు తీరారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా పలు రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. భక్తులు…

జాతీయం

సాంబ సెక్టారుకు చేరుకున్న హోం మంత్రి షిండే

శ్రీనగర్‌ : నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్‌ వరుసగా కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడుతున్న నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే ఇవాళ భారత సరిహద్దులోని పలు సెక్టార్‌ను పరిశీలించనున్నారు. కొద్దిసేపటి క్రితం షిండే సాంబ సెక్టార్‌కు…

జాతీయం

రాష్ట్ర విభజనపై పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న లగడపాటి

న్యూఢిల్లీ : రాష్ట్ర విభజనపై ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ వెనక్కి తీసుకున్నారు.రాష్ట్రాన్ని విభజించొద్దని కోరుతూ లగడపాటి రాజగోపాల్‌ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం విదితమే.

జాతీయం

నేడు జమ్మూకాశ్మీర్‌లో పర్యటించనున్న షిండే

న్యూఢిల్లీ : కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే ఇవాళ జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించనున్నారు. సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ప్రాంతాల్లో ఆయన పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు.