Wednesday, 4 November 2026

October 2013

హైదరాబాద్

రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం

హైదరాబాద్‌ : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతుంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుఫాన్‌ హెచ్చరికల కేంద్రం తెలిపింది. రాగల రెండ్రోజుల్లో ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంలో…

హైదరాబాద్

ఆగస్టా కుంభకోణంలో బ్రదర్‌ అనిల్‌ పాత్ర : భాజపా

హైదరాబాద్‌ : ఆగస్టా వెస్ట్‌ట్యాండ్‌ కుంభకోణంలో బ్రదర్‌ అనిల్‌ కుమార్‌ పాత్ర ఉందని భాజపా నేత ఎస్‌.వి.ఎస్‌.ఎస్‌ ప్రభాకర్‌ ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ …. స్విట్జర్లాండ్‌లో అరెస్టు చేసిన దళారి హాష్కిని భారత్‌కు రప్పించాలని డిమాండ్‌…

హైదరాబాద్

వరంగల్‌లో పోలీసుల 5కే రన్‌

హైదరాబాద్‌ : పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా పోలీసులు 5కే రన్‌ నిర్వహించారు. హన్మకొండలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద జిల్లా అర్బన్‌ ,రూరల్‌ ఎస్పీలు జెండా వూపి ప్రారంబించిన ర్యాలీ కలెక్టరేట్‌ వరకు…

రంగారెడ్డి

జువెలరీ షాపులో చోరి , 40 తులాల బంగారం అపహరణ

రంగారెడ్డి : జిల్లాలోని మహేశ్వరం మండలం తక్కుగూడలో జువెలరీ షాపులో చోరీ జరిగింది. దుండగులు 40 తులాల బంగారం, 12 కేజీల వెండిని అపహరించారు. బాధితుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

హైదరాబాద్

మత్స్యకారులతో సీఎం సమావేశం

హైదరాబాద్‌ : శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలోని డొంకూర్‌లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మత్స్యకారులతో సమావేశమయ్యారు. పై-లిన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వేకు విచ్చేసిన సీఎం మత్స్యకారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

వార్తలు

ఈనెల 25న టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశం

హైదరాబాద్‌ : ఈనెల 25న మధ్యాహ్నం రెండు గంటలకు తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గం సమావేశం కానుంది. తాజా పరిణామాలు ,భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది.

నిజామాబాద్

ఎల్లారెడ్డి ఎస్‌బీఐలో చోరికి దుండగుల విఫల యత్నం

నిజామాబాద్‌ : జిల్లాలోని ఎల్లారెడ్డి ఎస్‌బీఐ శాఖలో దొంగలు చోరికి విఫల యత్నం చేశారు. బ్యాంకు వెనుక ఉన్న కిటికి తొలగించి లోపలికి ప్రవేశించారు. బ్యాంకు లాకర్లు పగులగొట్టేందుకు దుండగులు విఫలయత్నం చేశారు. బ్యాంకు అలారం మోగడంతో మేనేజర్‌…

జాతీయం

నేటి నుంచి ప్రధాని విదేశీ పర్యటన

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ రష్యా,చైనాల్లో ఐదు రోజుల అధికార పర్యటన ఈరోజు బయలుదేరనున్నారు. ఈ రెండు దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరచుకోవడం ,రక్షణ,అంతరిక్ష, ఇందన ,వాణిజ్య ,పెట్టుబడుల రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవడం ఆయన పర్యటనలో ముఖ్య…

హైదరాబాద్

విశాఖ చేరుకున్న సీఎం కిరణ్‌

హైదరాబాద్‌ : పై-లిన్‌ తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వేకు హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి విశాఖ చేరుకున్నారు. విశాఖ నుంచి హెలికాప్టర్‌లో శ్రీకాకుళం జిల్లా చేరుకుని బాధితులను పరామర్శిస్తారు.

హైదరాబాద్

నేడు తుఫాన్‌ ప్రాంతాల్లో పర్యటించనున్న సీఎం

హైదరాబాద్‌ : రాష్ట్రంలో తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి ఎన్‌. కిరణ్‌కుమార్‌రెడ్డి నేడు పర్యటించనున్నారు.ఈ రోజు ఉదయం 7 గంటలకు శంషాబాద్‌ నుంచి బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలోని డొంకూరు గ్రామంలో తుఫాన్‌…