Tuesday, 3 November 2026

October 2013

హైదరాబాద్

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో డీజీపీ భేటీ

హైదరాబాద్‌ : సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతితో ఇన్‌చార్జ్‌ డీజీపీ ప్రసాద్‌రావు సమావేశమయ్యారు. సమావేశంలో శాంతి భద్రతల సమస్యపై చర్చించినట్లు సమాచారం.

హైదరాబాద్

దాడులను ముఖ్యమంత్రే ప్రోత్సహిస్తున్నారు :హరీష్‌ రావు

హైదరాబాద్‌ : శాంతిభద్రతలను కాపాడాల్సిన ముఖ్యమంత్రే దాడులను ప్రోత్సహిస్తున్నారని తెరాస ఎమ్మెల్యే హరీష్‌రావు ఆరోపించారు. ఈరోజు ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కేంద్రం నిశితంగా పరిశీలించాలని ఆయన అన్నారు.

ఖమ్మం

పాల్వంచలో పేలుడు పదార్థాలు స్వాధీనం

ఖమ్మం : జిల్లాలోని పాల్వంచ చెక్‌పోస్టు వద్ద వాహానంలో తరలిస్తున్న భారీ పేలుడు పదార్ధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

హైదరాబాద్

నాంపల్లి కోర్టుకు ఇండియన్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాది అక్తర్‌

హైదరాబాద్‌ : ఇండియన్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాది అసదుల్లా అక్తర్‌ను ఎస్‌ఐఏ అధికారులు కోర్టులో హాజరు పరిచారు. అక్తర్‌ను ఐదు రోజలు కష్టడీకి ఇవ్వాలని ఎస్‌ఐఏ అధికారులు కోర్టును అభ్యర్ధించారు.

హైదరాబాద్

తిరుపతి బయల్దేరిన ముఖ్యమంత్రి కిరణ్‌

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ మధ్యాహ్నం తిరుపతికి బయల్దేరి వెళ్లారు. తిరుమల బ్రహోత్సవాల నేపథ్యంలో సీఎం దంపతలు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. పుత్తూరులో ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో పోలీసులు సీఎం పర్యటనకు భారీ భద్రత ఏర్పాటు చేశారు.

హైదరాబాద్

తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా నవరాత్రి ఉత్సవాలు

హైదరాబాద్‌ : తెలంగాణ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల నవదుర్గ ఆలయంలో దేవీశన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. అమ్మవారు కనకదుర్గ దేవిగా దర్శనమివ్వనున్నారు. వేములవాడ రాజరాజేశ్వర ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.…

ఆదిలాబాద్

ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థుల గల్లంతు

ఆదిలాబాద్‌ : . ఆదిలాబాద్‌ జిల్లా దహేగాం మండలంలోని ఎర్రవాగులో ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. గజ ఈతగాళ్లతో వీరిని గ్రామస్థులు వెతికిస్తున్నారు.

హైదరాబాద్

తెలంగాణ భవన్‌లో బతుకమ్మ ఉత్సవాలు

హైదరాబాద్‌ : ఈ రోజు మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ మహిళా విభాగం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు జరుపుతున్నట్లు టీఆర్‌ఎస్‌ నాయకురాలు ఉమ తెలిపారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆమె ఆహ్వానించారు.

హైదరాబాద్

తెలంగాణలో ఘనంగా ప్రారంభమైన బతుకమ్మ పండుగ

హైదరాబాద్‌ : తెలంగాణ సంప్రదాయ పండుగ బతుకమ్మ వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. మహిళలు సాంప్రదాయ వస్త్రాలు ధరించి బతుకమ్మ ఆడారు. ” రంగురంగుల పూలకలబోత.మనసు పొరల్లో తంగేడు పూల స్పర్శ.సుతిమెత్తని రేకులుగా విచ్చుకున్న గుమ్మడిపూల సొగసు.…

సీమాంధ్ర

చిత్తూరు జిల్లాలో ఉగ్రవాదుల దాడి…. కానిస్టేబుల్‌ మృతి

చిత్తూరు : చిత్తూరు జిల్లా పుత్తూరులో అల్‌ ఉమా ఉగ్రవాదులు కలకలం రేపారు. ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న విశ్వసనీయ సమాచారం అందడంతో తమిళనాడు ,ఆంధ్రా పోలీసులు దాడి చేయగా … ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ కానిస్టేబుల్‌ మరణించాడు. ఓ ఇన్‌స్పెక్టర్‌కు…