కర్నూలు,(జనంసాక్షి): కుంభకోణాల మయమైన యూపీఏను వచ్చే ఎన్నికల్లో ప్రజలు గెలింపించరు అని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. 2014 లో కేంద్రంలో బీజేపీదే అధికారమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చాలా పార్టీలు కుటుంబ పార్టీలుగా మారిపోయాయి. అని ఆయన అన్నారు. పాజకీయాల్లో వారసత్వం కాదు జనసత్వం కావాలని ఆయన చెప్పారు. పత్రికలు సిద్ధాంతపరమైన రాజకీయలను ప్రోత్సాహించాలని ఆయన సూచించారు. సిద్దాంతాలు, విధానాలను చెప్పేవారు పార్టీ మారితే దిగజారుడు రాజకీయమే అవుతుందని ఆయన అన్నారు.




