Tuesday, 3 November 2026

January 2014

అంతర్జాతీయం

అమెరికాలో దుండగుడి కాల్పులు ముగ్గురి మృతి

కొలంబియా: అమెరికా మేరీల్యాండ్‌ రాష్ట్రంలోని కొలంబియాలో ఓ షాపింగ్‌మాల్‌లో దుండగులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందినట్లు సమాచారం.

మెదక్

సీఎం కుట్రను తిప్పి కొడతాం: డిప్యూటీ సీఎం

మెదక్‌ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కుట్రలు తిప్పికొడతామని డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ తెలిపారు. సీఎం కిరణ్‌ ఒక ప్రాంతంపైనే ప్రేమ చూపిస్తున్నారు. కిరణ్‌ ఒక ప్రాంతానికి కాతు ఒక రాష్ట్రానికి సీఎం అని గుర్తుంచుకోవాలని హితవు పలికారు.…

తెలంగాణ

సాయంత్రం టీ కాంగ్రెస్‌ నేతల సమావేశం

హైదరాబాద్‌: సాయంత్రం నాలుగు గంటలకు పోన్నాల నివాసంలో అందుబాటులో ఉన్న తెలంగాణ మంత్రులు, ప్రజాప్రతినిధులు సమావేశం కానున్నారు. తెలంగాణ బిల్లుపై సీఎం చేస్తున్న కుట్రలపై సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.

జాతీయం

దిగ్విజయ్‌ సింగ్‌తో ముగిసిన జానా భేటీ

ఢిల్లీ: దిగ్విజయ్‌సింగ్‌తో మంత్రి జానారెడ్డి సమావేశం ముగిసింది. అనంతరం మంత్రి జానారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పరిణామాలపై ఎలాంటి నివేదిక ఇవ్వలేదని తెలిపారు. సీఎం కిరణ్‌పై ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు. తాజా రాష్ట్ర పరిణామాలు కేంద్రంలో పెద్దలు అంతా చూస్తూనే…

జాతీయం

బిల్లు పంపింది అభిప్రాయం కోసమే: దిగ్విజయ్‌

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు బిల్లును అసెంబ్లీకి పంపింది. అభిప్రాయం కోసమేనని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్‌సింగ్‌ తెల్చి చెప్పారు. రాజ్యసభ సభ్యల ఎంపికపై పార్టీలో చర్చ జరుగుతుందన్నారు. పాతవాళ్లనే కొనసాగించాలన్న నిబంధనేమి లేదన్నారు. పార్టీ ప్రయోజనాల మేరకు…

హైదరాబాద్

కేకే ఏకగ్రీవంగా ఎన్నికవుతారు ఈటెల

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ జనరల్‌ సెక్రటరీ కె.కెశవవావు రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీంగా ఎన్నికవుతారని టీఆర్‌ఎస్‌ ఎల్‌పీ ఈటెల రాజేందర్‌ తెలిపారు. కేకేను ఎలా గెలిపించాలో తెలుసు, మా వ్యూహం మాకుందని ఈటెల పేర్కొన్నారు. తెలంగాణ కోసం త్యాగం చేసిన కేకేకు…

జాతీయం

పాఠశాలను కట్టనివ్వడం లేదని సర్పంచ్‌పై ఫిర్యాదు

ఛత్తీస్‌గఢ్‌ : దళితవాడ సమీపంలో పాఠశాల నిర్మించాడానికి అధికారులే ఆవరోధంగా మారారంటూ ఒక మహిళ సర్పంచ్‌ ఫిర్యాదు చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని వమిరెనా గ్రామ సర్పంచ్‌ ఈ ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్

కార్మికసంఘాలను మరోసారి చర్చలకు ఆహ్వనించిన బొత్స

హైదరాబాద్‌: కార్మిక సంఘాలతో ఉదయం ఆర్టీసీ యాజమాన్యం జరిపిన చర్చలు విఫలం కావడంతో రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి వారిని చర్చలకు ఆహ్వనించారు. ఈ రోజు రాత్రి 7గంటలకు మంత్రి కార్మికసంఘాల నేతలను చర్చలకు ఆహ్వనించారు.

జాతీయం

‘ఆప్‌’కి సర్వోదయ పార్టీ మద్దతు

కర్ణాటక: కర్ణాటకకు చెందిన సర్వోదయ పార్టీ ఆప్‌లో విలీనం కావడం లేక మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. ఫిబ్రవరి మొదటివారంలో ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. పలు దళిత, రైతు సంఘాలు కలిసి కర్ణాటక సర్వోదయ పార్టీని ఏర్పాటు…

హైదరాబాద్

గాంధీభవన్‌లో గణతంత్ర వేడుకలు

హైదరాబాద్‌: నాంపల్లిలోని గాంధీభవన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ. పలువురు కాంగ్రెస్‌ నేతలు హాజరయ్యారు.