Tuesday, 3 November 2026

January 2014

జాతీయం

గోవాలో కూలిన భవనం..శథిలాల కింద 40 మంది కూలీలు

గోవా : కనకోనా పట్టణం లో నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలింది. ఈ ఘటనలో శిథిలాల కింద 40 మంది కూలీలు చిక్కుకున్నట్లు సమాచారం. పోలీసులు, ఫైర్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.

హైదరాబాద్

రూ. 20 వేలతో బీసీ ఉప ప్రణాళిక ప్రకటించాలి : కృష్ణయ్య

హైదరాబాద్‌ : రూ. 20 వేల కోట్లతో బీసీ ఉప ప్రణాళిక ప్రకటించాలని ..లేకుంటే ఈ నెలాఖరున ఆందోళన చేస్తామని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షడు ఆర్‌. కృష్ణయ్య తెలిపారు. రాష్ట్రంలో బీసీలకు 50 శాతం సీట్లు కేటాయించకపోతే…

హైదరాబాద్

సీమాంధ్ర ఎమ్మెల్యేల వైఖరి రాజ్యాంగ విరుద్ధం : కోదండరాం

హైదరాబాద్‌ : సీమాంధ్ర ఎమ్మెల్యేలు అసెంబ్లీలో వైఖరి రాజ్యాంగ విరుద్ధమని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం మండిపడ్డారు. ఈ నెల 7న ఇందిరాపార్క్‌ వద్ద జరిగే సంపూర్ణ తెలంగాణ సాధన దీక్ష గోడపత్రికను కోదండరాం ఆవిష్కరించారు. తెలంగాణకు…

హైదరాబాద్

ఎస్‌.ఆర్‌.నగర్‌ పోలీసు స్టేషన్‌లో పొన్నం పై కారెంశివాజీ ఫిర్యాదు

హైదరాబాద్‌ : కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌పై మాలమహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ ఎస్‌.ఆర్‌.నగర్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఎం హెలికాప్టర్‌ను గాలిలోనే పేల్చివేస్తానన్న పొన్నం వ్యాఖ్యలపై ఆయన ఈ ఫిర్యాదు ఇచ్చారు.

హైదరాబాద్

ఈజిప్టులో చెలరేగిన ఘర్షణలు.. : 13 మంది మృతి

ఇంటర్‌నెట్‌డెస్క్‌ , హైదరాబాద్‌ : ఈజిప్టులో మహ్మద్‌ మోర్సీ మద్దతుదారులు దేశ వ్యాప్తంగా జరిపిన ర్యాలీ సందర్భంగా చెలరేగిన ఘర్షణల్లో 13 మంది మృత్యువాత పడ్డారు. ఈ మేరకు ఆ దేశ అధికార వర్గాలు మీడియాకు వెల్లడించాయి. మోర్సీని…

హైదరాబాద్

లైంగిక వేధింపుల బాధిత విద్యార్థినుల తరలింపునకు ఏర్పాట్లు

హైదరాబాద్‌ : నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలో జరిగిన లైంగిక వేధింపుల ఘటన బాధిత బాలికలను మునుగోడు కస్తూర్బా వసతి గృహంలో హరీశ్‌ అనే ట్యూటర్‌ విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే.

హైదరాబాద్

మహాజన సోషలిస్టు పేరుతో మందకృష్ణ కొత్త పార్టీ

హైదరాబాద్‌ : ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ‘మహాజన సోషలిస్టు’ పేరుతో కొత్త పార్టీ పెట్టాడు. సామాజిక న్యాయమే లక్ష్యంగా కొత్త పార్టీని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

జాతీయం

రాయితీ సిలిండర్లను పెంచే ప్రతిపాదనేదీ లేదు : మొయిలీ

న్యూఢిల్లీ : రాయితీ గ్యాస్‌ సిలిండర్లను 9 నుంచి 12కు పెంచే ప్రతిపాదనేదీ లేదని కేంద్ర మంత్రి మొయిలీ చెప్పారు. కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి చిదంబరం సిలిండర్ల సంఖ్యను 12కు పెంచాలన్న డిమాండ్‌ను పరిశీలిస్తున్నట్లు గురువారం వెల్లడించిన…

హైదరాబాద్

బిల్లుపై అసెంబ్లీలో కూలంకషంగా చర్చ జరపాలి : లగడపాటి

హైదరాబాద్‌ : రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో కూలంకషంగా చర్చ జరగాలని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే లక్ష్యంతో సీమాంధ్ర కాంగ్రెస్‌ ఎంపీలు చేపట్టిన సంకల్ప దీక్ష విరమణ అనంతరం లగడపాటి…

హైదరాబాద్

కాంగ్రెస్‌ ఎంపీల సంకల్ప దీక్ష విరమణ

హైదరాబాద్‌ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే లక్ష్యంతో చేపట్టిన సంకల్ప దీక్షను కాంగ్రెస్‌ ఎంపీలు విరమించారు. ధర్నాచౌక్‌లో కాంగ్రెస్‌ ఎంపీలు లగడపాటి రాజగోపాల్‌, సుబ్బం హరి, హర్షకుమార్‌లు దీక్ష చేపట్టిన సంగతి విదితమే.