Wednesday, 4 November 2026

February 2015

వార్తలు

మామిడిమాకులపల్లిలో జగన్‌

అనంతపురం జిల్లా లేపాక్షి మండలం మామిడి మాకులపల్లిలో వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన రైతు సిద్ధప్పను పరామర్శించారు.

వార్తలు

ఢిల్లీలో మోదీకి పట్టిన గతే కేసీఆర్‌కూ పడుతుంది: షబ్బీర్‌

నిజామాబాద్‌: ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీకి పట్టిన గతే సీఎం కేసీఆర్‌కూ పడుతుందని కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీ అన్నారు. కేటీఆర్‌ సభకు వచ్చి రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కార్యకర్త కుటుంబాన్ని కేటీఆర్‌ పరామర్శించకపోవడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం…

వార్తలు

వైజాగ్‌లో 11కేజీల గంజాయి స్వాధీనం

విశాఖపట్నం: విశాఖపట్నంలోని అల్లిపురం కొబ్బరితోట ప్రాంతంలో ఓ మహిళ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 11 కేజీల గంజాయిని టాస్క్‌ఫోర్సు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

వార్తలు

పాలమూరులో రోడ్డు ప్రమాదం: దంపతులు దుర్మరణం

మహబూబ్‌నగర్‌ : మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్‌పూర్‌ మండలం శేరిపల్లిలో కారు-లారీ ఢీకొన్న ఘటనలో దంపతులు దుర్మరణం పాలయ్యారు. ప్రమాదంలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు అనంతపురం జిల్లా వాసులు.

Featured News

చరిత్ర రివర్స్, 130 పరుగులతో సౌతాఫ్రికాపై భారత్ గెలుపు

మెల్‌బోర్న్: ప్రపంచకప్‌లో భాగంగా భారత్ – దక్షిణాఫ్రికా మధ్య మెల్ బోర్న్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్ 130 పరుగులతో ఘన విజయం సాధించింది. భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ 7 వికెట్లు కోల్పోయి 307 పరుగులు…

వార్తలు

అంబులెన్స్‌, వ్యాను ఢీకొని ఇద్దరు మృతి

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం కనకమామిడి కూడలి వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. అంబులెన్స్‌, డీసీఎం వ్యాను ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం.

వార్తలు

దక్షిణాఫ్రికాపై భారత్‌ ఘన విజయం

41వ ఓవర్‌ రెండో బంతికి దక్షిణాఫ్రికా తన పదో వికెట్‌ 177 పరుగుల వద్ద కోల్పోవడంతో భారత్‌ 130 పరుగులతో భారీ విజయాన్ని నమోదు చేసింది. జడేజా బౌలింగ్‌లో తహిర్‌ ఎల్బీగా వెనుదిరగటంతో మ్యాచ్‌ ముగిసింది. భారత్‌ బౌలింగ్‌లో…

వార్తలు

పల్స్‌పోలియో విజయవంతం

కోనరావుపేట : పోలియో మహమ్మారి నామరూపాలు లేకుండా చేయడానికి ఏర్పాటుచేసిన రెండవ విడత పోలియో ఆదివారం కార్యక్రమం విజయవంతంగా ప్రారంభమైంది. ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు రెండు చుక్కలు వేయడంతో ఈ మహమ్మారిని పారద్రోలడానికి అధికారులంతా కలసికట్టుగా ముందడుగు…

వార్తలు

రెండు వారాల్లో తీర్పు

మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత కర్ణాటక హైకోర్టులో ఎదుర్కొంటున్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసుపై మరో రెండు వారాల్లో తీర్పు వెలువడనున్నట్లు సమాచారం. ఇరుపక్షాల వాదోపవాదాలు ముగిసిపోగా రెండు వారాల్లో తీర్పు ఖాయమని భావిస్తున్నారు. చెన్నై,  ఆదాయానికి…

వార్తలు

దేశానికే ఆదర్శంగా కేజీ టు పీజీ విద్య

సీఎం కేసీఆర్ మానస పుత్రిక కేజీ టూ పీజీ విద్యను భారతదేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి ఈటెల. విద్యావ్యవస్థను గాడిలో పెడితేనే బంగారు తెలంగాణ నిర్మాణం జరుగుతుందని చెప్పారు. కరీంనగర్ లోని శాతవాహన…