Thursday, 5 November 2026

February 2015

Featured News

మేనిఫెస్టో ప్రతిబింబంగా బడ్జెట్‌:ఈటెల

హైదరాబాద్‌,ఫిబ్రవరి12(జనంసాక్షి): ఎన్నికల సందర్భంగా తాము ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా బడ్జెట్‌ ఉంటుందని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ స్పష్టంచేశారు. తను ప్రవేశపెట్టబోయే తెలంగాణ బడ్జెట్‌ ప్రయోగాత్మకంగా ఉంటుందని ఈటెల అన్నారు. గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని, సిఎం  కెసిఆర్‌…

Featured News

బానిసత్వం నుంచి బయటపడదాం

తెలంగాణకు ప్రతిరూపంలా సిలబస్‌ టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి కరీంనగర్‌, ఫిబ్రవరి 12 (జ నంసాక్షి) : తెలంగాణలోని ప్రతి అవకాశం ఇక్కడి బిడ్డలకు దక్కాలనే ఆతృతతో చేస్తున్న కసరత్తును కూడా కొంత మంది జీర్ణించుకోవడంలేదని దళితుడినైన నా…

Featured News

తెలంగాణను నేనే అభివృద్ధి చేశా..ఏపీ సీఎం చంద్రబాబు

వరంగల్‌, ఫిబ్రవరి 12(జనంసాక్షి) తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది తనేనని టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు అంటున్నరు. వరంగల్‌లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరైన ఆయన రెండు ప్రాంతాలకు న్యాయం చేస్తానని ప్రకటించారు. గతంలో…

Cover Story

జనం ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ పునర్నిర్మాణం

తొమ్మిది నెలల పాలనపై సమీక్ష కరెంటు కష్టాలను అధిగమిస్తాం బయ్యారంపై సర్వేకు నిర్ణయం   జనం మనోభావాలకు తగ్గట్టుగా పాలిస్తాం: సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి12(జనంసాక్షి): శతాబ్ద కాలంగా అనేక రకాల గోస పడిన తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగిన…

వార్తలు

వెట్టి చాకిరీ నుంచి 333 మందికి విముక్తి

హైదరాబాద్‌: తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో వెట్టిచాకిరీ నుంచి 333 మందికి విముక్తి లభించింది. ఇటుక బట్టీలో పనిచేస్తున్న కార్మికులను అధికారులు రక్షించారు. వెట్టి చాకిరీ బాధితుల్లో ఒడిశాకు చెందిన 50 మంది చిన్నారులు ఉన్నారని వారు తెలిపారు.

వార్తలు

డిమాండ్‌ మేరకు విద్యుత్‌ సరఫరా చేస్తున్నాం: ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో డిమాండ్‌ మేరకు విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో రోజువారీ డిమాండ్‌ 140 మిలియన్‌ యూనిట్లు కాగా డిమాండ్‌ మేరకు కోతలు లేకుండా విద్యుత్‌ సరఫరా చేస్తున్నామన్నారు. వ్యవసాయానికి ఆరుగంటల…

జాతీయం

అమెరికా పోలీసు ఎన్‌కౌంటర్‌లో భారతీయుడికి గాయాలు

ఇంటర్నెట్‌డెస్క్‌, హైదరాబాద్‌: పర్యటన నిమిత్తం అమెరికా వెళ్లిన ఓ భారతీయుడు అక్కడి పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో గాయపడ్డారు. ఓ వ్యక్తి అనుమానాస్పదంగా సంచరిస్తున్నాడని వచ్చిన సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని అతనిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో…

వార్తలు

మేజర్‌ హుస్సేన్‌ మృతదేహం ప్రత్యేక విమానంలో తరలింపు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ జీడిమెట్ల సూరారం ప్రాంతానికి చెందిన మేజర్‌ ఎస్‌. హుస్సేన్‌ నిన్న జమ్ములో సైనిక హెలికాప్టర్‌ కూలిన ఘటనలో మృతిచెందారు. మేజర్‌ హుస్సేన్‌ మృతదేహాన్ని జమ్మునుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్‌ విమానాశ్రయానికి తరలిస్తున్నారు.

తెలంగాణ

ఆస్తిపన్ను కట్టలేదని కార్వాన్‌లోని ఎస్‌బీఐ సీజ్‌

హైదరాబాద్‌: ఆస్తిపన్ను కట్టలేదని హైదరాబాద్‌లోని కార్వాన్‌లో ఉన్న ఎస్‌బీఐ శాఖ కార్యాలయాన్ని సీజ్‌ చేశారు. ఆస్తిపన్ను బకాయిల వసూళ్లపై దృష్టిపెట్టిన జీహెచ్‌ఎంసీ అధికారులు ఎస్‌బీఐని సీజ్‌ చేశారు.

తెలంగాణ

నేటి వార్మప్‌ మ్యాచ్‌ల్లో వెస్టిండీస్‌, ఐర్లాండ్‌ల విజయం

ఇంటర్నెట్‌డెస్క్‌, హైదరాబాద్‌: ప్రపంచకప్‌కు ముందుగా నేడు జరిగిన రెండు వార్మప్‌ మ్యాచ్‌ల్లో వెస్టిండీస్‌, ఐర్లాండ్‌లు గెలుపొందాయి. ఈ మ్యాచ్‌ల్లో స్కాట్‌ల్యాండ్‌పై మూడు పరుగుల తేడాతో వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌పై నాలుగు వికెట్ల తేడాతో ఐర్లాండ్‌ విజయాల్ని సొంతం చేసుకున్నాయి.