Tuesday, 3 November 2026

June 2015

జిల్లా వార్తలు

చెన్నైర్ రిపోర్టర్ నాయుడుపేటలో ఆత్మహత్య….

నెల్లూరు:చెన్నైలో ఓ ప్రముఖ పత్రికకు రిపోర్టరుగా పనిచేస్తున్న పీఆర్‌కే శాస్ర్తి ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాల కారణంగా నాయుడుపేటలోని ఓ లాడ్జీలో పీఆర్‌కే శాస్ర్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

జిల్లా వార్తలు

మట్టిపెళ్లలు విరిగిపడ్డి ఇద్దరు కూలీలు మృతి

విశాఖ:మరుగుదొడ్డిని నిర్మించేందుకు గొయ్యి తవ్వుతుండగా మట్టిపెళ్లలు విరిగిపడి ఇద్దరు కూలీలు మృత్యువాత పడిన సంఘటన రోలుగుంట మండలం ఎం కొత్తపట్నం గ్రామంలో జరిగింది.

వార్తలు

చిత్తూరు జిల్లాలో నాటు తుపాకుల కలకలం…

చిత్తూరు: తంబళ్లపల్లె నియోజకవర్గం పరిధిలోని మూడు మండలాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. వీరి తనిఖీల్లో 60 నాటు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్

సనత్‌నగర్‌ లో రౌడీ షీటర్ లక్ష్మణ్ అరెస్టు….

హైదరాబాద్:సనత్‌నగర్‌ ఫతేనగర్‌లో లక్ష్మణ్‌ అనే రౌడీషీటర్‌ను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మణ్‌ వద్ద నుంచి రెండు తుపాకులు, రెండు బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్

ఈటెలను పరామర్శించిన దత్తాత్రేయ…

హైదరాబాద్:రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ను కేంద్ర కార్మికశాఖ మంత్రి దత్తాత్రేయ పరామర్శించారు. ఇటీవల కరీంనగర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈటెల గాయపడిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొంది…

జాతీయం

ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ

ఢిల్లీ:రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర నెలలో ప్రజలంతా కలిసి మెలిసి జీవించాలని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు.

హైదరాబాద్

చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరూ దొంగలే:భట్టి విక్రమార్క

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ఇద్దరూ దొంగలేనని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ… దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు బాబు, కేసీఆర్ రాష్ట్రాలను పంచుకున్నారని దుయ్యబట్టారు.…

జాతీయం

నితిన్ గడ్కరీ తో భేటీ అయిన కేటీఆర్

ఢిల్లీ: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ భేటీలో తెలంగాణ లో జాతీయ రహదారుల నిర్మాణం పై చర్చించినట్లు సమాచారం.

జిల్లా వార్తలు

రెండు రోజుల్లో చంద్రబాబు నివాసంఖరారు:మంత్రినారాయణ

విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి విజయవాడలో తాత్కాలిక నివాసాన్ని రెండు రోజుల్లోగా ఖరారు చేయనున్నట్లు మంత్రి నారాయణ చెప్పారు. ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ… హైదరాబాద్ లోని ఏపీ ఉద్యోగులందరినీ విజయవాడకు తరలిస్తామని స్పష్టం చేశారు.