Tuesday, 3 November 2026

2019 నాటికి 275 స్థానాలు

శనివారం శ్రీకాకుళం జిల్లాలోని డ్వాకా మహిళా సంఘాల సమావేశంలో ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. డ్వాక్రా సంఘాలకు చంద్రబాబు రెండో విడత రుణమాఫీ విడుదల చేశామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. మహిళలకు అండగా నిలబడతానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పేద కుటుంబాలు ఆనందంగా ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు. మీకు ఇచ్చిన నిధులను మీ ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేసుకోవచ్చని చంద్రబాబు తెలిపారు. 90 లక్షల మంది ఆడబిడ్డలు ఉన్నార న్నారు. పేద కుటుంబాలకు 15 సూత్రాల కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. సంక్రాంతి కానుక మళ్లీ అందజేస్తామని చంద్రబాబు తెలిపారు. చంద్రన్న జీవిత బీమా మొదలు పెట్టమన్నారు. ప్రమాదవశాత్తు చనిపోతే ఈ బీమా కింద 5 లక్షలు ఇస్తామన్నారు. chandrababu-naidu-pti_647_080216012602నియోజకవర్గాల సంఖ్య 275కు పెరిగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ఆశావహులందరికీ అవకాశాలు దక్కుతాయని చంద్రబాబు స్పష్టం చేశారు. కార్యకర్తల సమా వేశంలో ఈ విషయాన్ని చంద్రబాబు వెల్లడించారు. పార్టీ సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు చంద్రబాబు సూచించారు. రోడ్డుల జంక్షన్‌ వద్ద ఎన్టీఆర్‌, ఎరన్న్రాయుడు పొట్టిశ్రీరాములు విగ్రహాలకు సీఎం పూలమాల వేసి నివాళులర్పించారు. మంత్రి అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *