ఆగస్టు 21న ప్రారంభంకానున్న శ్రావణపౌర్ణమి వ్రతాలు

విశాఖపట్నం, ఎం.వి.పి. కాలనీ:తితిదే, డిపిపి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మనగుడి కార్యక్రమాన్ని విశాఖ జిల్లాలో 1130 దేవాలయాల్లో జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నామని ధర్మప్రచార మండలి జిల్లా ఉపాధ్యక్షులు రాంబాబు తెలిపారు. ఆగస్టు 8 నుంచి ఆలయ శోభ పేరిట ఆలయాలను శుభ్రంచేసి మన గుడి ఉత్సవాలను ప్రారంభిస్తామన్నారు. 12న 108 గుళ్లలో కుంకుమార్చన, 14న గోపూజ, 16న సామూహిక వరలక్ష్మీ వ్రతాలు, 17న సత్యనారాయణ వ్రతాలు నిర్వహిస్తామన్నారు. శ్రావణపౌర్ణిమ పురస్కరించుకొని 21న అన్ని దేవాలయాల్లో మనగుడి జరుగుతుందని, ఇందులో భాగంగా అభిషేకాలు, అర్చనలు, సామూహిక పారాయణాలు జరిపించేందుకు సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ధర్మప్రచార మండలి కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.