మాచర్ల: గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం మెట్టమీదపల్లి వద్ద పోలీసులు చెక్‌పోస్టు ఏర్పాటు చేసి వాహన తనిఖీలు చేపట్టారు. కర్నూలు జిల్లా నంద్యాల నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారును తనఖీ చేయగా రూ. 26లక్షలు పట్టుబడ్డాయి. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆధారాలు చూపకపోతే నగదును ఆదాయపన్ను శాఖకు అప్పగిస్తామని ఎస్సై ప్రసాద్ తెలిపారు.




