Wednesday, 4 November 2026

27 నుంచి షటిల్‌ పోటీలు

విశాఖపట్టణం,మార్చి26  (జ‌నంసాక్షి) : అనకాపల్లిలో ఈనెల 27, 28, 29 తేదీల్లో ఉత్తరాంధ్ర డబుల్స్‌ షటిల్‌ బ్యాట్మింటన్‌ పోటీలు నిర్వహిస్తున్నట్లు క్లబ్‌ నిర్వాహకులు  తెలిపారు. ఈనెల 20, 21, 22 తేదీల్లో  వాయిదా పడ్డ ఈ పోటీలను ఈనెల 27 నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. పోటీలకు ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, శాసనసభ్యుడు పీలా గోవింద సత్యనారాయణ ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఇక ఆంధప్రదేశ్‌ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ ఏప్రిల్‌ 10 నుంచి 12వ తేదీ వరకు విశాఖ స్టీల్‌ ప్లాంటులో 4వ రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.. క్రీడల్లో పాల్గొనేందుకు వీఆర్వోల ఎంపిక ఈ నెల 29న ఆంధ్రా వర్సిటీలో జరుగుతుందన్నారు. ఉత్సాహం, నైపుణ్యం కలిగిన క్రీడాకారులు ఎంపికలో పాల్గొనాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *