Thursday, 5 November 2026

300 టన్నుల ఇనుప ఖనిజం సీజ్‌

బేతంచర్ల, జనంసాక్షి: కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం పరిధిలోని తవిసికొండ గ్రామ సమీపంలో సర్వేనెంబరు 1019లో అక్రమంగా తవ్వి నిల్వ ఉంచిన 300 టన్నుల ఇనుప ఖనిజాన్ని సీజ్‌ చేసినట్లు జిల్లా భూగర్బ గనుల శాఖ రాయల్టీ అధికారి రత్నకాంత్‌బాబు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఇనుప ఖనిజాన్ని స్థానిక వీఆర్వో జనార్ధన్‌కు అప్పగించినట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *