పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని అశ్వారావుపేట రోడ్డులో ఉన్న జీటీపీ టవర్స్‌లో మంగళవారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. కొల్లి సత్యశ్రీకి చెందిన నివాసంలో ఎవరూ లేని సమయంలో ప్రవేశించిన దొంగ సుమారు 60 కాసుల బంగారాన్ని అపహరించాడు. మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి వచ్చిన సత్యశ్రీ ఇంటి తలుపు తీస్తుండగా లోపల ఎవరో ఉన్నారని గమనించి తలుపు బయట గొళ్లెం తగిలించి , చుట్టుపక్కలవారిని పిలవడానికి వెళ్లింది. ఈలోగా దొంగ బలవంతంగా తలుపు లాగి పరారయ్యాడు. ఎస్‌ఐ నాగేశ్వర్ నాయక్ ఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరిస్తున్నారు.




