తిరువూరు: కృష్ణా జిల్లా తిరువూరు సమీపంలోని ముత్తగూడెం చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేయగా రూ. 10లక్షలు పట్టుబడ్డాయి. సీఐ ప్రసాదరావు, ఎస్ఐ బి. వెంకటేశ్వరరావులు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఖమ్మం జిల్లా నుంచి వస్తున్న కారులో రూ. 10లక్షలు ఉన్నట్లు గుర్తించారు. పట్టుబడిన నగదుకు సంబంధించి కారులో ఉన్నవారు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో రూ. 10 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.




