
ఐదుగురికి గాయాలు
కొనసాగుతున్న ఉద్రిక్తత
జి.కొండూరు, జూలై 7 (జనంసాక్షి) :
ప్రజలపై ఓ పోలీస్ ఇన్‌స్పెక్టర్ తుపాకీ ఎక్కుపెట్టాడు. ఠాణాపైకే దాడికి వస్తారా అంటూ ఆగ్రహంతో ఊగిపోతూ ప్రజలపై కాల్పులు జరిపాడు. సర్వీస్ రివాల్వర్‌తో ఎలాంటి అనుమతులు లేకుండానే సదరు ఇన్‌స్పెక్టర్ రెచ్చిపోయాడు. ఈ ఘనట కృష్ణా జిల్లా జి.కొండూరులో చోటు చేసుకుంది. మండలంలోని కోడూర్ గ్రామానికి చెందిన రామకృష్ణ అనే యువకుడి మృతికి ఎస్సై కారణమంటూ ఆ గ్రామస్తులు ఆదివారం పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. యువకుడి మృతికి కారణకుడైన ఎస్సైని చితకబాదారు. పోలీసు స్టేషన్‌లోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. దాడి సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న మైలవరం సీఐ బంగర్రాజు గ్రామస్తులపై కాల్పులు జరిపారు.ఆ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సంఘటన స్థలం నుంచి ఎస్సై సీఐలు పరారయ్యారు. పోలీసుల దాడిని నిరసిస్తూ కోడూర్ గ్రామస్తులు ఆందోళన కొనసాగిస్తున్నారు. దీంతో అర్ధరాత్రి దాటే వరకూ అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది.
ఘటనపై విచారణ జరిపిస్తాం
జి.కొండూరు ఘటనలో గాయపడి ఆస్పత్రిలో క్షతగాత్రులను ఏలూరు రేంజి డీఐజీ విక్రంసింగ్‌మాన్ పరామర్శించారు. ఘటనపై విచారణజరిపించి బాధ్యులైనవారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. జి.కొండూర్‌లో జరిగిన కాల్పుల ఘటనను తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించాడు. ఈ ఘటనకు బాధ్యులైన పోలీసులను తక్షణమే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్‌చేశారు. దీనిపై జాయింట్ కలెక్టర్‌తో న్యాయ విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు.
జి.కొండూర్‌లో జనంపై ఇన్‌స్పెక్టర్ కాల్పులు




