పర్చూరు: ప్రకాశం జిల్లా పర్చూరు మండలం నూతలపాడులో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, వైకాపా కార్యకర్తల మధ్య ఏర్పడిన వివాదం ఘర్షణకు దారితీసింది. ఇరు వర్గాల వారు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో నలుగురికి గాయాలయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు చీరాల వైద్యశాలలో చికిత్స పొందుతుండగా, వైకాపాకు చెందిన వ్యక్తిని చికిత్స కోసం గుంటూరు ఆసుపత్రికి తరలించారు.




