చిత్తూరు: చిత్తూరు జిల్లా పుంగనూరులో ఈసీ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి 7వేల ఓట్లు తొలగించినట్లు వచ్చిన అరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓట్ల గల్లంతుపై ఈనాడు కథనానికి అధికారులు స్పందించారు. జిల్లా కలెక్టర్ సాల్మన్ అరోగ్య రాజు పుంగనూరు నియోజకవర్గంలో ఓట్ల గల్లంతుపై విచారణకు అదేశించారు. పథకం ప్రకారమే ఓట్లు తొలగించారంటూ తెదేపా కార్యకర్తలు పుంగనూరు సోమల బస్టాండ్ వద్ద రాస్తారోకో చేపట్టారు.




