తిరుపతి,(జనంసాక్షి): సమైక్యాంధ్రకుకు మద్దతుగా తిరుపతి నగరంలో విద్యార్థులు బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తిరుపతి పట్టణ క్లబ్ వద్ద విద్యార్థులు రోడ్డుపై బైటాయించి రాస్తారోకో నిర్వహించారు. దాంతో నగర వీధులల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వాహనాలను మరో మార్గం ద్వారా మళ్లించారు.




