నెల్లూరు (ఫతేఖాన్‌పేట): సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలు నెల్లూరు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ నెల్లూరు ట్రంకురోడ్డు, గాంధీ బొమ్మ, వి. ఆర్. జి సెంటర్ మీదుగా కలెక్టరేట్‌కు చేరుకుంది. అనంతరం కలెక్టరేట్‌ను ముట్టడించారు. కలెక్టరేట్ ప్రధాన గేటు ముందు బైఠాయించి ఉద్యోగులు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. కలెక్టరేట్ లోపలికి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.




