Tuesday, 3 November 2026

ఎనిమిదో రోజుకు చేరిన నైవేలి కార్మికుల సమ్మె

కడలూరు: నైవేలీ లిగ్నైట్‌ కార్పొరేషన్‌ (ఎస్‌ఎల్‌సీ) కార్మికుల సమ్మె ఎనిమిదో రోజుకు చేరుకొంది. ఈ సంస్థలో కేంద్రం వాటా 5 శాతాన్ని విక్రయించాలనే నిర్ణయానికి వ్యతిరేకంగా కార్మికులు సమ్మె చేపట్టారు. దాదాపు 30వేల మంది కార్మికులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. వీరిలో 13వేల మంది ఒప్పంద కార్మికులున్నారు. అయితే 7వేల మంది ఇంజినీర్లు, అధికారులు సమ్మెకు దూరంగా ఉన్నారు. ఎస్‌ఎల్‌సీలో విద్యుదుత్పత్తిలో ఎలాంటి అటంకం లేదని సంస్థ ప్రకటించింది. మద్రాసు హైకోర్టు నిర్ణయాన్ని ధిక్కరించి వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ సమ్మె సాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *