తెలంగాణ తొలి విప్లవ వీరుడు దొడ్డి కొమరయ్య
తెలంగాణ సాయుధ పోరాటం చరిత్ర వినగానే మొదటగా గుర్తొచ్చేది తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు తొలి అమరుడు దొడ్డి కొమరయ్య . 19లి’27లో ఒకే సాదారణ కుటుంబంలో వరంగల్లు జిల్లా దేవరుప్పుల మండలం కడివెండి గ్రామంలో పట్టాడు. విసునూర్ దేశ్‌ముఖ్‌లు నిజా నవాబు కాళ్ల కింద నలిగిపోయారు. భారత దేశం బ్రిటిష్ సామ్రాజ్యవాదంలో భాగమైపోయినా, హైదరాబాద్ రాష్ట్రంలో 1860 వరకు పోరాటం సాగింది. బ్రిటిష్ నిజాం పాలనకు వ్యతిరేకంగా వేలాది మంది తమ ప్రాణ త్యాగాలు చేశారు. 1947 ఆగస్టు 15న బ్రిటిష్ వలసవాదులు మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు. స్వాతంత్య్రం వచ్చిందని ఆనందంలో ప్రజలు పలకరించి పోతున్నారు.. ఎటు చూసినా జాతీయ పతాకాలు రెపరెపలాడు తున్నాయి. వందేమాతరం గీతాలు ఆలపించుతున్నారు. భారతమాతకు వందనాలు చెబుతూ ఆనందత్సోహాల మధ్య సంబరాలు జరుపుకుంటున్నారు. హైదరాబార్ రాష్ట్రం నిజాం నిరంకుశ పాలనలో మగ్గుతోంది. ఆంధ్రమహాసభ కమ్యూనిస్టు పార్టీల నాయకత్వానా మహోజ్వలమైన సాయుధ పోరాటం ప్రారంభమైంది. రజాకార్లు, విసునూర్ దేశ్‌ముఖ్‌లు, పటేల్, పట్వారీల దోపిడిలు అంతులేకుండా పెరిగిపోయాయి. స్త్రీలపై మానభంగాలు, గ్రామగ్రామాలన తగులబెట్టారు. ప్రజలు రజార్లు, నిజాం దాడులను తట్టుకోలేక పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లి తలదాచుకున్నారు. కడివెండిలో విసునూర్ దేశ్‌ముఖ్ రామచంద్రా రెడ్డి తల్లి జానకమ్మా దొరసాని ఆమె కడికవెండిలో వుంటుంది వీరు ప్రజల పట్ల అతి క్రూరంగా వ్యవహరించేవారు. మనషులను వెట్టిచాకిరి చేయించడంలో వడ్డీలు వసూలు చేయడంలో రకరకాల శిక్షలు, జరిమానాలు విధించడంలో పేరుగాంచింది. వెట్టి చాకిరికి దొపిడికి వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాట సేనాని ఆరుట్ల రాంచంద్రారెడ్డి, కడివెండి వెళ్లి ఆంధ్ర మహా సభ సందేశాని& న్రపజలకు వినిపించాడు దీంతో గ్రామంలో సంఘమేర్పడింది. ఉత్సాహంగా యువతీ యువకులు ముందుకొచ్చారు. దిన దినంగా కడివెండిలో సంఘం బలంగా అవుతుంది వెట్టచాకిరిని నిర్మూలిం చారు. దొరలు, విసునూర్ ల ఆటలను అరికట్టారు. 1946 జులై 2న విసునూర్ నైజాం అల్లరి మూకలు రౌడీలతో 40 మంది వాచ్చారు ప్రజలంతా ఏకమై కర్రలు, బడిశెలు, గుతుపలు అందుకుని విసునూర్, నిజాం, రజాకర్లను తరిమికొట్టారు. నైజాం అల్లరి మూకలు, విసునూర్ తుపాకి తూటాలకు నేలరాలిన అరుణతార, తెలంగాణ విప్లవంలో చెరగని ముద్రవేసుకున్నాడు దొడ్డి కొమురయ్య. మరణ వార్త జనగామ ప్రాంత ఆంధ్రమహాసభ కార్యకర్తలందరకీ విషాదకరమైన వార్తయింది. దేశ్‌ముఖ్, విసు నూర్ ఆగడాలన ఎదుర్కోవవడానికి పాలకుర్తి ప్రాంతం నుంచి యాదగిరిరావు, నిర్మల్ కృష్ణమూర్తి, నాయకత్వంలో ఆరు వేల మంది ప్రజాసైన్యం దొడ్డి కొమరయ్య మృతదేఠహానికి పోస్టుమార్టం జరిగింది. వేలాది మంది జనం నాయకత్వంలో అంతిమ యాత్ర జరుపుతు
అమరజీవివి నీవు కొమురయ్యస
అందుకో విప్లవ జోహార్లు కోమరయ్య
న్యాయాన్ని పాతరేసిన నైజామొడు
విశ్వాస ఘాతుడైనా విసునూర్ దొరోడు
భూమిక్సం భూవిముక్తి కోసం
విసునూర్ దేశ్‌ముఖ్‌ల ఆగడాల నెదిరించి
సర్వసమానవ సమతకై అసువులు బాసిని దొడ్డి కొమరయ్య
నై జాంను తరిమికొట్ట
చీమలదండై కదిలినావా
వీర తెలంగాణ విప్లవ పోరాటంలో
గుండెకు గెండెనిచ్చి రక్తాన్ని దారపోస్తివా
తరతరాలుగా నీ త్యాగం శాశ్వతంగా వెలుగొందును.
అందుకో లాల్ సలాం దొడ్డి కొమరయ్య ఊరగింపు వాడ వడలా సాగుతుంది. కమ్యూనిస్టు పార్టీ వర్ధిల్లాలి విసునూర్ దేశ్‌ముఖ్‌ల దౌర్జన్యం నశించాలంటూ నినాదాలు చేస్తూ మరింత ముందుకు సగుతున్నారు. అశేష ప్రజానీకమంతా ధైర్య సహాసాలతో ప్రాణాలకు బరితెగించి రజాకర్లను ఎదుర్కోవడనికి బోడ్రాయి వరకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ కాపు కాసిన నైజాం అల్లరి మూకలు ఎకపక్షంగా కాల్పులు జరిపారు. ఊరేగింపులోఅగ్ర భాగంగా ఉన్న దొడ్డి కొమరయ్యకు తుపాకి తూటాలు కడుపులో దిగడంతో కమ్యూనిస్టుపార్టీ వర్ధిల్లాలి, జౌ ఆంధ్ర మహాసభ అంటూ కుప్పకూలినాడు. తోటి కార్యకర్తలు నైజాం అల్లరి మూకలపై దాడులకు పూనుకుంటున్నారు. భూస్వామి విసునూర్‌లకపై అణిగిమనిగిఉన్న ప్రజల కోపం కట్టలుతెచ్చుకుంది. ప్రజలంతా మూకుమ్మడిగా విసునూర్ భూస్వాముల గడీలపై దాడులు చేసి రజాకార్ల గుండాలను తరిమి తరిమి కొట్టారు. దొడ్డి కొమురయ్య వీర మరణంతో సాయుధ పోరాటం మరింత పోరాట రూపం దాల్చింది. ఉస్మానియా విశ్శ విద్యాలయంలో చదువుతున్న పానుగంటి సీతారామారావు అనిరెడ్డి రామిరెడ్డిచలసాని శ్రీనివాసరావు, గాది మధన్‌రనెడ్డి, గంగసాని చేరి తిరుమలరెడ్డి సాయుధ పోరాటం చేసి ఆయుధాలు ధరించారు. వందలతా దిమంది విద్యార్థులు పోరాటంలో చేరి ఆయుధాఉ ధరిచంఆరు వందలాది మంది విద్యార్థులు ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహిస్తూ తెలంగాణ ప్రజానికానికి అండై నిలిచారు. శత్రుదాడులను ఎదుర్కోయనేదుకు ప్రజలు ఎప్పుడు తమ చేతుల్లో కారంపొడి రోకలిబండలు, కద్రలు పట్టుకుని సిద్దంగా ఉండేవారు. దొడ్డి కొమురయ్య నాయకత్వం వహిస్తే దొడ్డి కొమురయ్య స్పూర్తితో వేలాది మంది తమ ప్రాణాలను తృణ ప్రాయంగా వదిఆరు నాలువువేల ఐదొందలమంది నేలరాలారు. ఆ అమర వీరుల చిదించిన ఎర్రని నెత్తుటి ధారలు మృతవీరుల ఆవయాలతో తెలంగాణ సాయుధపోరాటానికి ప్రపంచ మంత పరచయమయింది 1994లో కడివెండిలొ నల్లా నర్సింహులు, అర్ట్లు రామచంద్రారెడద్డి దొడ్డి మల్లయ్య, భీంరెడ్డి, నర్సింహారెడ్డి. వట్టికోట ఆళ్ళరామస్వాములు ఈంధ్ర మహాసభను ప్రారంభించారు. ఒకప్పుడు జనగామ తాలకా నల్గోండ జిల్లాలో వుండేది నేడు వరంగల్లు జివలాలలో కలిపారం అయ్యా నీ బాంచన్ దొర అంటూ అణిగి మణిగి వున్నోళ్లే నిప్పురవ్వలై బందూకలు బట్టి నిజాం నవాబు గద్దెను సాయుధ పోరాటం ద్వాఆర కూల్చి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగించారు. దొడ్డి కొమరయ్య హంతకులు నరహంతకులు ఫాసిస్టులు విచారించలేదు. హంతకులెవ్వరికీ శిక్షించబడలేదు. పైగా రాదు వరం పోలీస్‌పటేల్ బండిని తగుల బెట్టారనే నెపం తో కమ్యూనిస్టు నేతలు కట్నూరి రామచంద్రారెడ్డి మర్రి రామిరెడ్డి కృష్ణమూర్తి ఎర్రంరెడ్డి మహన్‌రెడ్డిలపై తప్పుడు కేసులు బనాయించారు. ఇవన్నీయు సాధించుకునేందుకు ప్రజలు త్యాగాలకు సిద్దం కండి ప్రజాస్వామిక తెలంగాణాను సాధించుకు నేందుకు ప్రజలు త్యాగాలకు సిద్దం కండి త్యాగాల చిరునామా తెలంగాణ దొడ్డి కొమురయ్య త్యాగ స్పూర్తిని ఇటవెలిగ్చింఇ దదొపిడిని నిర్మూలించమే అసలైన అశ్రునివాలి.
-దామెరపల్లి నర్సింహారెడ్డి