Tuesday, 3 November 2026

ఎన్నికలకు నాలుగంచెల భద్రత: డీఐజీ బాలకృష్ణ

అనంతపురం,(జనంసాక్షి): పంచాయితీ ఎన్నికల సందర్భంగా నాలుగంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు అనంతపురం రేంజ్‌ డీఐజీ బాలకృష్ణ శుక్రవారం వెల్లడించారు. పంచాయితీ వేలంపాటంకు సహకరిస్తున్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిగి ఎస్‌ఐపై విచారణ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో 15 వేల 240మందిపై బైండోవర్‌ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. తన ఈ మెయిల్‌ హ్యక్‌ చేసిన సత్యసాయి సమీప బంధువు రత్నాకర్‌ బ్లాక్‌ మెయిలింగ్‌ చేస్తున్నారని గణపతిరాజు ఫిర్యాదును పరిశీలిస్తున్నామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *