అనంతపురం: చట్టాన్ని కాపాడాల్సిన పోలీసు అధికారులే నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నారు. కడప పోలీస్ కంట్రోల్ రూంలో సీఐగా పనిచేస్తున్న అర్జున్ నాయక్ తన భార్య పద్మలత భాయితో అనంతపురం జిల్లా నల్లమాడ పంచాయతీకి నామినేషన్ వేయించారు. ఈ స్థానం మహిళకు రిజర్వ్ కావటంతో అర్జున్ నాయక్ తన భార్యను బరిలోకి దించారు. ఇవాళ ఉదయాన్నే భారీ ర్యాలీగా నల్లమాడ ఎంపీడీవో కార్యాలయానికి వచ్చారు. ర్యాలీలో పద్మలత వెంట ఆమె భర్త అర్జున్ కూడా ఉన్నారు. ఎంపీడీఓ కార్యాలయంలో కూడా అమె వెంటనే ఉండి నామినేషన్ పత్రాలపై సంతకాలు చేయించటం, ఎన్నికల అధికారికి అందించటం చేశారు.




