ముసునూరు: కృష్ణా జిల్లా ముసునూరు మండలంలోని వేలుపుచర్లలో కాంగ్రెస్ అనుయాయులపై శుక్రవారం రాత్రి వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో సుచేశ్వరరావు (50) తీవ్రంగా గాయపడడంతో అతని ని విజయవాడ తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. గాయపడిన మరో నలుగురు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాంగ్రెస్ వర్గీయులు వైకాపా అభ్యర్థిని దూషించడంతో రెండు వర్గాల మధ్య గొడవ జరిగిందని ఎస్సై వి.వెంకటేశ్వరరావు తెలిపారు. ఇరు పక్షాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.




