Wednesday, 4 November 2026

ఐకాస ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర సదస్సు

నెల్లూరు (బారకాసు): ఐకాస ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని పద్మావతి కల్యాణ మండపంలో సమైక్యాంధ్ర సదస్సు జరిగింది. సభలో పాల్గొన్న నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి మాట్లాడుతూ సీడబ్య్లూసీ, కోర్‌ కమిటీలో కానీ తెలంగాణపై నిర్ణయం తీసుకోరని అన్నారు. ధైర్యం ఉంటే పార్లమెంటులో ఈ అంశంపై మద్దతు తీసుకురావాలని సవాలు విసిరారు. భాషా సంయుక్త రాష్ట్రాన్ని వేరు చేయాలంటే రాజ్యాంగ సవరణ తప్పదని ఆయన వివరించారు. నెల్లూరు నగర ఎమ్మెల్యే శ్రీధర్‌ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ రాజీనామాలకు సిద్ధంగా ఉన్నామని. సమైకాంధ్ర కోసం ఎలాంటి త్యాగానికైనా తాము ముందుంటామని ప్రకటించారు. సమైకాంధ్ర ఉద్యోగుల సంఘం నేత రవీంధ్ర మాట్లాడుతూ ….. అతి త్వరలో హైదరాబాద్‌లో సమైక్యాంధ్ర ఉద్యోగ సంఘాల సదస్సును నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థి ఐకాస నేత కృష్ణయాదవ్‌, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు నర్సింహారావు , తెదేపా నగర అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *