కడప: కాంగ్రెస్ పార్టీ ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టిస్తోందని కర్నూలు సీపీఎం పార్టీ మాజీ శాసనసభ్యులు గపూర్ విమర్శించారు. రాజకీయ స్వప్రయోజనాల కోసమే పనిచేయడం దారుణమని అన్నారు. కడప సీపీఎం పార్టీ కార్యాలయంలో ఈరోజు నగర విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ అంశంపై ఈనెల 12న నిర్ణయం వెలువడుతుందనుకున్నామని కానీ కాంగ్రెస్ పార్టీ మరోసారి తన నిర్లిప్తత చాటుకుందని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా నర్వీర్యమైపోయిందని, రాజకీయ పదవుల కోసమై రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడం దారుణమని విమర్శించారు.




