కాకినాడ : కేజీ బేసిస్‌లో రిలయన్స్ సహజ వాయువు దోపిడీకి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో ఉద్యమం చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. ఢిల్లీలో ఆగస్టు 7,8 తేదీల్లో జరగనున్న సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశంలో రిలయన్స్ దోపిడీపై చర్చిస్తామని ఆయన తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో చెప్పారు. అర్థిక ప్రజాస్యామ్యాన్ని కాపాడకపోతే జాతి తీవ్రంగా నష్టపోతుందని అవేదన వ్యక్తం చేశారు. రిలయన్స్ చేతిలో ప్రధాని మన్మోహన్‌సింగ్ బొమ్మేనని ఎద్దేవా చేశారు.




