Tuesday, 3 November 2026

గుండెపోటుతో మృతి చెందిన కోటగిరి విద్యాధరరావు

ఏలూరు,(జనంసాక్షి): మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత కోటగిరి విద్యాధరరావు కన్నుమూశారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోట మండలం తూర్పుఎడవల్లి గ్రామం వచ్చేందుకు ఆయన కారు ఎక్కబోతుండగా గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. హయాంలో మంత్రిగా పని చేసిన విద్యాధరరావు 2009 ఎన్నికల ముందు తెదేపి నుంచి ప్రరాపాలో చేరారు. ప్రజారాజ్యం పార్టీలో క్రీయాశీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఆయన పీసీసీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. ఆయన మృతికి పలువురు నేతలు సంతాపం ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *