ఐ. పోలవరం: తూర్పు గోదావరి జిల్లాలోని తీరప్రాంత లంక గ్రామాలు ఇంకా వరద నీటిలోనే నానుతున్నాయి. గ్రామాల్లోకి వరద నీరు చేరి ఐదురోజులు కావస్తున్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందకపోవడంతో బాధితులు గగ్గోలు పెడుతున్నారు. తాగునీరు, ఆహారం అందించాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎగువ నుంచి వచ్చే వరద నీరు తగ్గినా మరో రెండు రోజుల వరకు వరద నీరు గ్రామాల్లోనే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.




