విశాఖ: విశాఖ విమానాశ్రయం పరిసర ప్రాంతంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కొందరు దుండగులు ఓ వ్యక్తిని ముక్కలుగా నరికి మూటలో కట్టి విమానాశ్రయం పరిసరాల్లో పడేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతుని వయస్సు సుమారు 45 సంవత్సరాలు ఉంటుందని, మృతుని వివరాలు తెలియాల్సి ఉందన్నారు.




