Wednesday, 4 November 2026

మండపాక గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ

తణుకు: పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలంలోని మండపాక గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఓ పార్టీకి చెందిన అభ్యర్థులు పోలింగ్‌ కేంద్రంలోకి చొరబడి ఓట్లు అభ్యర్థిస్తున్నారని ఆరోపిస్తూ మరో వర్గం నాయకులు ఘర్షణకు దిగారు. దీంతో కాంగ్రెస్‌, వైకాపా నాయకులు పరస్పరం దూషించుకుంటూ ఘర్షణకు దిగారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *