Tuesday, 3 November 2026

వరద నీటిలో వెళ్తుండగా పాము కాటుకు గురై నరసింహమూర్తి మృతి

మామిడి కుదురు: తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలంలోని అప్పనపల్లి గ్రామానికి చెందిన గ్రామ సేవకుడు ఆకుమర్తి నరసింహమూర్తి (55) మృతి చెందాడు. గోదావరి వరద ఉద్ధృతికి అప్పనపల్లి గ్రామం వరద నీటిలో ఉంది. గ్రామ సేవకుడిగా పనిచేసే నరసింహమూర్తి ఈ ఉదయం విధులకు హాజరయ్యేందుకు వరద నీటిలో వెళ్తుండగా పాము కాటుకు గురై మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *