నెల్లూరు: విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం పరిధిలోని బీఈడీ పరీక్షలను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి ఎస్. మురళీమోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా ‘లా’ నాలుగో సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేశామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ప్రకటించిన పరీక్షల తేదీలను పూర్తిగా రద్దు చేశామని చెప్పారు. సమైక్యాంధ్ర ఉద్యమం చల్లబడిన తరువాత తిరిగి రద్దుచేసిన పరీక్షల తేదీలను ప్రకటిస్తామన్నారు. విద్యార్థులు, విద్యా సంస్థల ప్రతినిధులు పరీక్షలు వాయిదావేసిన విషయాన్ని గమనించాలని కోరారు.




