విశాఖ : రాగల 24గంటల్లో పలు చోట్ల వానలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.ఒడిశా తీరాన్ని ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుంది.దీనికి తోడు ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుంది.దీనికి తోడు ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి చురుగ్గా కదులుతోంది.వీటి ప్రభావం వల్ల ఉత్తరకోస్తా,తెలంగాణల్లో పలు చోట్ల ,దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ వానలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు




