Tuesday, 3 November 2026

రూ.70లక్షల విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం

బాకరాపేట : చిత్తూరు జిల్లా బాకరాపేట అటవీ ప్రాంతంలో అటవీశాఖ డీఎఫ్‌వో శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు, అటవీశాఖ సిబ్బంది సంయుక్తంగా దాడులు జరిపి అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న లారీ, సుమోలను స్వాధీనం చేసుకున్నారు. లారీ కిందిభాగంలో 40 ఎర్రచందనం దుంగలను ఉంచి రహణా చేస్తుండగా పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మరో ఘటనలో సుమోలో తరలిస్తున్న ఎర్రచందనం విలువ రూ.70లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ వాహనాలను స్వాధీనం చేసుకుంటున్న సమయంలో అటవీ ప్రాంతంలో ఉన్న సుమారు 100 మందికి పైగా స్మగ్లర్లు, కూలీలు అధికారులపై రాళ్లతో దాడిచేశారు.సిబ్బంది సకాలంలో స్వందించి వారిపై ప్రతి దాడి చేయడంతో స్మగ్లర్లు ఆటవీ ప్రాంతంలోకి పారిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *